మాన్‌సూన్‌ సేల్: రూ.1299కే విమాన టికెట్లు

ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ గోఎయిర్‌ ‘మాన్‌సూన్‌ సేల్‌’ పేరుతో తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది.

Last Updated : Jun 5, 2018, 08:29 AM IST
మాన్‌సూన్‌ సేల్: రూ.1299కే విమాన టికెట్లు

న్యూఢిల్లీ: ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ గోఎయిర్‌ ‘మాన్‌సూన్‌ సేల్‌’ పేరుతో తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. పరిమిత కాలం వరకు ఆఫర్‌ కింద రూ.1299కే టికెట్‌ను ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి బుకింగ్స్ ప్రారంభం కాగా.. మరో రెండు రోజులు వరకు బుక్ చేసుకొనే వెసలుబాటును కల్పించారు. ఈ ఆఫర్‌ కింద కొన్న వన్ వే టికెట్‌తో జూన్‌ 24 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు దేశంలోని పలు నగరాలకు ప్రయాణించవచ్చు. గోఎయిర్ నెట్‌వర్క్ పరిధిలోని నాన్-స్టాప్ విమానాలకే ఈ ఆఫర్ వర్తించనుండగా.. ఇలా బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేస్తే డబ్బులు తిరిగి చెల్లించరు.

23 గమ్యస్థానాలకు వారంలో 1,544కు పైగా విమాన సర్వీసులను గోఎయిర్‌ నడిపిస్తోంది. వీటిలో హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌, బెంగళూరు, చండీగఢ్‌, చెన్నై, ఢిల్లీ, గోవా, గౌహతి, జైపూర్‌, జమ్మూ, కోచి, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్‌, పట్నా, పుణె, శ్రీనగర్‌ వంటి నగరాలకు ఉన్నాయి.

Trending News