Goa elections 2022 : మాజీ సీఎం కుమారుడు అయినంత మాత్రానా సీటు ఇవ్వం..

Goa elections 2022, Devendra Fadnavis snubs Utpal Parrikar ticket : త్వరలో గోవాలో జరగబోయే ఎలక్షన్స్‌లో...పనాజీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలనుకుంటోన్నారు మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఉత్పల్ పారికర్‌. పార్టీ నేతల కొడుకులు అయినంత మాత్రానా బీజేపీ టికెట్ ఇవ్వదంటున్నారు.. బీజేపీ గోవా ఎన్నికల ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 06:12 PM IST
  • త్వరలో గోవాలో ఎలక్షన్స్‌
  • పనాజీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలనుకుంటోన్న ఉత్పల్ పారికర్‌
  • పార్టీ నేతల కొడుకులు అయినంత మాత్రానా బీజేపీ టికెట్ ఇవ్వదన్న బీజేపీ గోవా ఎన్నికల ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్
Goa elections 2022 : మాజీ సీఎం కుమారుడు అయినంత మాత్రానా సీటు ఇవ్వం..

Goa elections 2022 : BJP’s Goa election in charge Devendra Fadnavis snubs Utpal Parrikar Panaji ticket : 
త్వరలో దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గోవాతో (Goa)) పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. గోవాలో ఫిబ్రవరి 14న (February 14) ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

అయితే గోవా అసెంబ్లీ ఎన్నికల (Goa Assembly Election) నేపథ్యంలో.. ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. గోవాలోని 40 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు పొలిటికల్ హీట్ (Political heat) పెరిగింది. ఇప్పటికే అన్ని రాజ‌కీయ పార్టీలు గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టాయి. సీట్ల కేటాయింపు విషయంలో కొన్ని పార్టీల్లో అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. 

గోవాలోని పనాజీ సీటు (Panaji seat in Goa) కేటాయింపు విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ నుంచి పనాజీ సీట్‌పై ఆశలు పెట్టుకున్నారు.. ఆ పార్టీ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (Former Chief Minister Manohar Parrikar) కుమారుడు ఉత్పల్ పారికర్‌. 

అయితే ఉత్పల్ పారికర్‌‌కు బీజేపీ నుంచి ఉహించని పరిణామం ఎదురైంది. త్వరలో జరగబోయే గోవా ఎలక్షన్స్‌లో (Goa Elections‌) పనాజీ నుంచి పోటీ చేయాలని ఉత్పల్ పారికర్‌ (Utpal Parrikar) కోరగా.. బీజేపీ (BJP) తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.

ఉత్పల్ పారికర్‌‌ (Utpal Parrikar) డిమాండ్‌ను బీజేపీ తోసిపుచ్చింది. ఈ మేరకు బీజేపీ గోవా ఎన్నికల ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్.. (BJP Goa election in charge Devendra Fadnavis) తమ పార్టీ నేతల కొడుకులు అయినంత మాత్రానా బీజేపీ టికెట్ ఇవ్వదని స్పష్టం చేశారు. అర్హత ఉన్న వారికి బీజేపీ మొదటి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 

అమిత్ షాతో జరిగిన మీటింగ్‌లో ఏం చర్చ జరిగిందో తనకు తెలియదు అన్నారు దేవేంద్ర ఫడ్నవిస్. (Devendra Fadnavis ) తనకు సమాచారం వచ్చాకే తన అభిప్రాయం తెలియజేస్తాను అని చెప్పుకొచ్చారు. 

Also Read : విశాఖలో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన జీపు.. ఇద్దరు మృతి...

ఇక 2019లో తన తండ్రి అకాల మరణం తర్వాత.. ఉత్పల్ పారికర్ పనాజీలో ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడని... కానీ బీజేపీ మాత్రం సిద్ధార్థ్ కుంకలింకర్‌కు (Siddharth Kunkalinkar‌) ఆ స్థానం టికెట్ ఇచ్చిందని ఫడ్నవీస్ తెలిపారు. గోవాలో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాపై కసరత్తు కొనసాగుతుందని ఫడ్నవీస్ పేర్కొన్నారు. పార్టీ అధిష్టానంతో చర్చించాక, అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే బీజేపీ (BJP) తనకు టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఉత్పల్ పారికర్ పేర్కొన్నారట. కానీ అమిత్ షా (Amit Shah) మాత్రం అలా చేయొద్దని కాస్త వెయిట్ చెయ్యమని ఉత్పల్ పారికర్‌‌కు సూచించినట్లు తెలుస్తోంది.

Also Read : Viral video: అదృష్టం అంటే అతడిదే- క్షణాల్లో రెండు సార్లు చాపు తప్పింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News