MP High court: భారతీయ బాలికలెవరూ కూడా సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మకంగా చెబితే తప్ప, ఇలాంటి వాటికి అంగీకరించరంది. ఓ యువకుడి బెయిల్ పిటిషన్ ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు(MP High court) ఈ వ్యాఖ్యలు చేసింది.
ఉజ్జయినికి చెందిన యువకుడు ఓ యువతిపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే మరో యువతిని పెళ్లి చేసుకొంటానని యువతికి అతను చెప్పడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. 2018 అక్టోబర్ నుంచి అతను ఆమెపై అత్యాచారం (Rape) చేశాడు. 2020 జూన్ లో ఆమెను పెళ్లి చేసకోవడానికి అతను నిరాకరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Also Read: తెలంగాణలో దారుణం: పశువులపై అత్యాచారం..వాడు అలా.. వీడు ఇలా..!
దీంతో ఆ యువకుడిపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం దరఖాస్తు చేయగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్(indore) బెంచ్‌కు చెందిన జస్టిస్ సుబోధ్ అభయంకర్ విచారణ జరిపారు. ఆమెకు 21 ఏళ్లు నిండాయని, ఇష్టప్రకారమే సంబంధం పెట్టుకున్నామంటూ నిందితుడు చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. ఇలా సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా ఆ తర్వాత జరిగే పర్యవసానాలను కూడ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
బాలికలు సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరు: మధ్యప్రదేశ్ హైకోర్టు
బాలికలు సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరు..
మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఓ యువకుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా తీర్పు