వేద మంత్రోచ్ఛారణలతో గంగా హారతి

కొత్త ఏడాది ప్రారంభమైన సందర్భంగా గంగమ్మకు హారతి ఇచ్చారు.  2020 సంవత్సరం తొలి రోజు వేకువజామునే .. గంగా హారతి నిర్వహించారు. తెల్లవారుజామునే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 

Last Updated : Jan 1, 2020, 09:49 AM IST
వేద మంత్రోచ్ఛారణలతో గంగా హారతి

కొత్త ఏడాది ప్రారంభమైన సందర్భంగా గంగమ్మకు హారతి ఇచ్చారు. 2020 సంవత్సరం తొలి రోజు వేకువజామునే .. గంగా హారతి నిర్వహించారు. తెల్లవారుజామునే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వేద పండితులు , భక్తులు ఈ గంగా హారతిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఏడాది అంతా బాగుండాలని కోరుకుంటూ వారణాసిలోని గంగమ్మ తల్లికి హారతి ఇచ్చారు.

జై.. జై..గణేశా.. 
కొత్త సంవత్సరం తొలి రోజున భక్తులు తమ ఇష్ట దేవతలకు పూజలు నిర్వహిస్తున్నారు.  2020 సంవత్సరం అంతా సాఫీగా .. ఆనందంగా సాగిపోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. ముంబైలోని సిద్ధి వినాయకుని ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ ఏడాది సాగాలని కోరుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుని ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News