Freebies For Voters: ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీ, ఫ్రీ రైడ్‌

Lok Sabha Election Offers Free Beer Free Tiffins In UP And Karnataka: ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా అయితే మీకు మద్యం, ఆహారం ఉచితంగా దక్కుతాయి. ఓటు వేస్తే ఉచితంగా బీరు పొందొచ్చు.. స్పెషల్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ తినవచ్చు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 25, 2024, 08:29 PM IST
Freebies For Voters: ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీ, ఫ్రీ రైడ్‌

Freebies For Voters: సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. వారి ప్రయత్నాలు అలా చేస్తుంటే ఎన్నికల సంఘం.. ఇతర సంస్థలు మాత్రం ఓటర్లను పోలింగ్‌ కేంద్రానికి తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని హోటళ్లు, కొన్ని సంస్థలు ఓటర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటు వేసిన వారికి ఉచితంగా టిఫిన్లు, మద్యం ఇస్తామని కొన్ని ప్రకటించాయి.

Also Read: Nominations End: ముగిసిన నామినేషన్ల పర్వం.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు

ఏప్రిల్‌ 26వ తేదీన కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. ఓటింగ్‌ శాతం పెంచేందుకు కొన్ని ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని నృపతుంగ రోడ్డులోని నిసర్గ హోటల్‌లో ఓటు వేసిన వారు తమ సిరా గుర్తు చూపిస్తే ఉచితంగా బటర్‌ దోశ, గీ రైస్‌, ఒక కూల్‌ డ్రింక్‌ ఇవ్వనుంది. ఈ మేరకు ఆ హోటల్‌ యాజమాన్యం ప్రకటన చేసింది.

Also Read: YS Jagan Assets: దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్‌.. ఆయన ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..

  • కర్ణాటకలోని బెల్లందూర్‌లోని ఓ పబ్‌ మరొక అడుగు ముందుకు వేసింది. బెల్లందూర్‌లోని డెక్‌ ఆఫ్‌ బ్రైస్‌ అనే రెస్టో పబ్‌ ఎన్నికల సందర్భంగా రెండు రోజుల పాటు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 27, 28వ తేదీల్లో ఓటర్లకు ఒక జగ్గు బీర్‌ ఉచితంగా ఇవ్వనుంది. దీంతోపాటు కొన్ని ఆఫర్లు ఇచ్చింది. ఓటు వేసిన వారందరూ అక్కడకు వెళ్లి సిరా చుక్క చూపియాలి అంతే. 
  • సోషల్‌ అనే పబ్‌ అద్భుత ఆఫర్‌ ప్రకటించింది. ఓటర్ల కోసం వారం రోజుల పాటు 20 డిస్కౌంట్‌ ప్రకటించింది.ఇక రవాణా విషయంలో ప్రముఖ ఆన్‌లైన్‌ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ర్యాపిడో ఆఫర్లు ఇచ్చింది. ఓటు వేయడానికి వెళ్లాలనుకున్న వృద్ధులు, దివ్యాంగులకు ఉచితంగా క్యాబ్‌ సేవలు ప్రకటించింది.
  • ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కొన్ని సంస్థలు, ఆస్పత్రులు కీలక ప్రకటన చేశాయి. ఓటు వేసిన వారికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేస్తామని ప్రకటించాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News