Flag Code Of India: జాతీయ జెండా. మువ్వన్నెల జెండాకు ఓ ప్రత్యేక గౌరవముంది. జెండా ఎగురేవేయాలంటే కొన్ని నిబందనలున్నాయి. అదే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఫ్లాగ్ కోడ్‌లో మార్పులు చేసింది. ఆ మార్పులేంటో చూద్దాం.
దేశ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని చాటి చెప్పేది జాతీయ జెండా మాత్రమే. ఆ జాతీయ జెండా గౌరవాన్ని ఇనుమడింపచేసేందుకు, ఎక్కడా అగౌరవం కలగకుండా ఉండేందుకు కొన్ని నియమాలు, నిబంధనలు రూపొందించారు. అదే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా. ఈ కోడ్‌లోని నిబంధనల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయి. రాత్రిళ్లు ఎగురవేయడంలో ఆంక్షలు, జాతీయ దినాల్లోనే ఎగురవేయాల్సి రావడం ఇలాంటి నిబంధనలో ఇబ్బందులు ఎదురయ్యేవి. వివిధ రకాలుగా తలెత్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది.
ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం యంత్రాలతో తయారు చేసే జెండాల్ని ఎగురవేయకూడదు. నూలు, నేసిన ఉన్న, పత్తి, సిల్క్ ఖాదీ సహాయంతో చేతితో చేసిన జాతీయ జెండాలకే అనుమతి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. యంత్రాలతో చేసిన పాలిస్టర్ జెండాల దిగుమతి లేదా తయారీకు అవకాశం లభించింది. ఫలితంగా గాలులు , ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా జెండాలు దెబ్బతినకుండా క్షేమంగా ఉంటాయి. పాలిస్టర్‌తో తయారు చేసిన జెండాల్ని కూడా వినియోగించవచ్చనేది తాజా నిబంధన.
ఇక జెండాల్ని సూర్యాస్తమయానికి దించాల్సిన అవసరం లేదు. రాత్రి సమయంలో తగినంత వెలుతురులో కూడా పెద్ద పెద్ద జెండాల్ని ఎగురవేయవచ్చు. పాలిస్టర్ జెండాలకు అనుమతివ్వడంతో గాలులు, ప్రతికూల వాతావరణంలో దెబ్బతినకుండా ఉంటాయి. అయితే మెటీరియల్ బాగుండేట్టు చూసుకోవాలి. మరోవైపు ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులోని అట్టారీకు సమీపంలో దేశంలోనే ఎత్తైన ప్రాంతంలో త్రివర్ణపతాకం ఎగురవేయనున్నారు. జెండా దెబ్బతింటుందనే కారణంతో చాలాకాలంగా అక్కడ జెండా ఆవిష్కరణ జరగలేదు. కొత్త నిబంధనల ప్రకారం జెండా గౌరవానికి భంగం వాటిల్లనంతవరకూ త్రివర్ణ పతాకాల్ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ జెండాల్ని మాత్రం వినియోగించకూడదు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాలు, సంస్థలపై ఏడాది పొడుగునా జెండా ఎగురవేయవచ్చు. జాతీయ జెండాపై అందరిలో గౌరవం పెరిగేలా..విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, స్పోర్ట్స్ కేంద్రాలు, స్కౌట్ శిబిరాల్లో త్రివర్ణ పతాకం తప్పకుండా ఎగురవేయాలి.
దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లు మరణించినప్పుడు పాటించాల్సిన నియమాల్ని ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా స్పష్టంగా వివరించింది. జెండాను కొంత ఎత్తువరకూ దించి గౌరవించాలనేది ఆ నిబంధన. ఇక సగం ఎత్తులో జెండాను ఎగురవేయడమనేది అవమానించడమే అవుతుంది. అందుకే జెండా ఎగురవేటప్పుడు పూర్తి ఎత్తులో ఉందో లేదో చూసుకోవాలి.
Also read: Kacha Badam singer Bhuban: 'కచ్చా బాదమ్' సింగర్‌కు రోడ్డు ప్రమాదం.. ఆస్పత్రిలో చేరిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి