కేరళ రాష్ట్రం ఇటీవలి కాలంలో మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో దళితులను గుళ్లో పూజారులుగా నియమించిన ఇదే ప్రాంతం ఈసారి ముస్లిములు విషయంలో కూడా మరో సంస్కరణ పద్ధతికి వేదికైంది. దేశచరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా ఓ కేరళ మహిళ జుమ్మా నమాజ్‌కు ఇమామ్‌గా వ్యవహరించింది. 34 సంవత్సరాల జమిథా ప్రస్తుతం మల్లప్పురంలోని ఖురాన్ సున్నతి సొసైటీకి సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాన్ని పఠించడంలో వివక్ష ఉండకూడదని.. ఈ పనిని పురుషులతో పాటు స్త్రీలు కూడా చేయవచ్చని ఆమె తెలిపారు. స్త్రీలు ఇమామ్‌గా వ్యవహరించకూడదని ఖురాన్ లేదా ఏ ఇతర ముస్లిం గ్రంథాలు తెలపలేదని ఆమె అన్నారు. ప్రస్తుతం జమిధా ఓ స్కూలులో టీచరుగా పనిచేస్తున్నారు. ఆమె ఇమామ్‌గా వ్యవహరించి ఖురాన్‌ను పఠిస్తున్నప్పుడు.. ఆ ప్రార్థనల మీటింగ్‌కి కొందరు మహిళలు కూడా హాజరవ్వడం గమనార్హం. అయితే ఇప్పటికే జమిధా ఇమామ్‌గా వ్యవహరించడం పట్ల పలు ముస్లిం సంస్థలు విరుచుకుపడుతున్నాయి.
భారతదేశంలోనే తొలి మహిళా ఇమామ్