First time a Dalit in CPM Politburo: దశాబ్దాల పార్టీ చరిత్రలో.. పొలిట్ బ్యూరోలో ఒక్క దళిత వ్యక్తికీ స్థానం కల్పించలేదనే విమర్శను ఎట్టకేలకు సీపీఎం తొలగించుకుంది. 58 ఏళ్ల పార్టీ చరిత్రలో తొలిసారిగా ఒక దళిత వ్యక్తికి స్థానం కల్పించింది. దళిత సామాజికవర్గానికి చెందిన పశ్చిమ బెంగాల్ మాజీ ఎంపీ రామచంద్ర డోమ్‌ను పొలిట్ బ్యూరోలోకి తీసుకుంది. కేరళలోని కన్నూర్‌లో జరుగుతున్న పార్టీ 23వ జాతీయ మహా సభల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది.
పార్టీ పొలిట్ బ్యూరోలో రామచంద్ర డోమ్‌తో పాటు కేరళ సీపీఎం నేత, ఎల్డీఎఫ్ కన్వీనర్ విజయ రాఘవన్, ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధవాలెలకు చోటు దక్కింది. మొత్తం 17 మంది సభ్యులతో కూడిన పొలిట్ బ్యూరోలో ఈ ముగ్గురు కొత్త ముఖాలు కావడం గమనార్హం. బెంగాల్‌కు చెందిన సీనియర్ నేతలు రామచంద్రన్ పిల్లై, బిమన్ బోస, హనన్ మొల్లాలను పొలిట్ బ్యూరో నుంచి తప్పించారు. వీరి వయసు 75 ఏళ్లు దాటడంతో ముగ్గురినీ పక్కనపెట్టారు.
ఇక ఇదే జాతీయ మహా సభల సందర్భంగా 85 మంది సభ్యులతో కూడిన పార్టీ సెంట్రల్ కమిటీని కూడా ఎన్నుకున్నారు. ఇందులో 15 మంది మహిళలు కాగా.. మొత్తంగా 17 మంది కొత్త ముఖాలకు చోటు దక్కింది. 2018లో పార్టీ సెంట్రల్ కమిటీ 95 మందితో ఉండగా.. ఇప్పుడా సంఖ్యను 85కి తగ్గించారు.
ఇక సీపీఎం ప్రధాన కార్యదర్శిగా 69 ఏళ్ల సీతారాం ఏచూరి వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏప్రిల్, 2015లో విశాఖపట్నంలో నిర్వహించిన సీపీఎం 21వ జాతీయ మహాసభల్లో తొలిసారి పార్టీ జాతీయ కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. అంతకుముందు, 15 ఏళ్ల పాటు ప్రకాష్ కారత్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.
Also Read: Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' పోస్టర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ న్యూ లుక్ చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook