FIR Against Kangana Ranaut: మరో వివాదంలో కంగనా రనౌత్.. ముంబయిలో ఆమెపై కేసు నమోదు

Kangana Ranaut Latest News: రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టడం వల్ల నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంలా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ముంబయిలో ఆమెపై కేసు నమోదుయ్యింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 08:47 AM IST
FIR Against Kangana Ranaut: మరో వివాదంలో కంగనా రనౌత్.. ముంబయిలో ఆమెపై కేసు నమోదు

Kangana Ranaut Latest News: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది. తమ మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానిస్తున్నారంటూ సిక్కులు ముంబయిలోని ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రైతు చట్టాలు తీసుకొచ్చిన మొదటి రోజు నుంచి రైతుల నుంచి వ్యతిరేకంగా వ్యక్తమవుతుంది. దీనిపై కంగనా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాలను విమర్శించే వారిపై ఫైర్‌ అయ్యారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంగనా రనౌత్ గళం విప్పింది. ఈ నేపథ్యంలో సిక్కులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. సిక్కు సమాజం మొత్తాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులుగా అభివర్ణించింది. మరోవైపు ఇటీవల జాతిపిత మహాత్మా గాంధీపైన కూడా పలు వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలోనూ ఆమెపై కేసు నమోదు చేశారు.

కంగన చేసిన ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా నేతృత్వంలోని ప్రతినిధులు సోమవారం ముంబయిలోని సీనియర్ పోలీసు అధికారులను కలిశారు. సిక్కుల మనోభావాలు దెబ్బతీసేలా కంగన వ్యవహరిస్తుందని.. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు కంగనా రనౌత్‌పై ముంబయిలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Also Read: Free Biryani For Tomatoes: బిర్యానీ లవర్స్ కు గుడ్ న్యూస్.. కేజీ టమాటాలకు బిర్యానీ ఉచితం

Also Read: త్వరలో పూర్తి కానున్న జీల్ - సోనీ విలీన ప్రక్రియ : పునీత్ గోయెంకా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News