Last Video of CDS Helicopter: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న ఆర్మీ విమానం.. నిన్న తమిళనాడులోని నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో కుప్పకూలింది.
ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సీడీఎస్ బిపిన్ రావత్ తంపతులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.
సరిగ్గా హెలికాప్టర్ కుప్పకూలే కొన్ని క్షణాల ముందు ఎలా ఉందో ఈ వీడియో ద్వారా వెల్లడైంది. మేఘాలు నిండుగా కమ్ముకున్నట్లు ఇందులో కనిపించింది. మేఘాల్లోంచి దూసుకెళ్లిన కొన్ని క్షణాల్లోనే హెలికాప్టర్ కుప్పకూలినట్లు తెలిసింది. వాతావరణం అనుకూలించకనే హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు పలువురు ఈ వీడియోను చూసి తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హెలికాప్టర్ కూలిన స్థలానికి కాస్త దూరంలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ వీడియోను చిత్రికరించారు. ఆ దృశ్యాలను మీరు చూడండి.
#WATCH | Final moments of Mi-17 chopper carrying CDS Bipin Rawat and 13 others before it crashed near Coonoor, Tamil Nadu yesterday
(Video Source: Locals present near accident spot) pic.twitter.com/jzdf0lGU5L
— ANI (@ANI) December 9, 2021
Also read: BlackBox: బిపిన్ రావత్ హెలీకాప్టర్ బ్లాక్‌బాక్స్ ఎక్కడ, అందులో ఏముంది
Also read: General Naravane: తదుపరి సీడీఎస్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook