బీజేపీ సీనియర్ నేత, మాజీమంత్రి యశ్వంత్ సిన్హా ను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సిన్హా విదర్భ ప్రాంతంలో నిరసన చేపట్టారు. మహారాష్ట్రలోని అకోలా జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులకు నాయకత్వం వహించి బైఠాయించారు. సోమవారం రాత్రి అక్కడే నిద్రించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయన్ను ఇక్కడ బైఠాయించవద్దని నచ్చజెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సెక్షన్ 68 కింద అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు అకోలా జిల్లా ఎస్పీ రాకేష్ కళాసాగర్ చెప్పారు.
Maharashtra; Yashwant Sinha detained while leading a farmers' march in Akola, yesterday; later released. pic.twitter.com/nDzIRlpBhQ
— ANI (@ANI) December 5, 2017