Farmers Protest: హర్యానా సరిహద్దు రక్తసిక్తం, టియర్ గ్యాస్ ప్రయోగంలో రైతు మృతి

Farmers Protest: పంజాబ్  హర్యానా సరిహద్దు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సమస్యల పరిష్కారానికి కదం తొక్కిన అన్నదాతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఓ యవరైతు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 21, 2024, 09:00 PM IST
Farmers Protest: హర్యానా సరిహద్దు రక్తసిక్తం, టియర్ గ్యాస్ ప్రయోగంలో రైతు మృతి

Farmers Protest: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతున్నలు రక్తం చిందించారు. పోరుబాట పట్టిన రైతన్నలపై హర్యానా సరిహద్దులో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ద్రోన్ల సహాయంతో టియర్ గ్యాస్ ప్రయోగించడంతో షెల్ తగిలి ఓ యువ రైతు ప్రాణాలు కోల్పోయాడు. 

23 రకాల వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర కల్పించే గ్యారంటీతో చట్టం తీసుకురావాలన్నది రైతుల డిమాండ్. దీనికోసం ఉద్యమించిన అన్నదాతలు ఛలో ఢిల్లీ చేపట్టారు. శాంతియుతంగా పాదయాత్రగా ఢిల్లీవైపుకు వెళ్తున్న రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ ఐదంచెల భద్రతా వ్యవస్థతో అంతరాయం కల్పించారు. అన్నింటినీ ఛేదించుకుని ముందుకు వెళ్తున్న రైతుల్ని హర్యానా సరిహద్దులో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. అన్నదాతలపై ద్రోన్ల సహాయంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ షెల్ తగిలి యువ రైతు శుభ్ కరణ్ సింగ్ మరణించాడు. మరో 160 మంది రైతులు గాయపడ్డారు. టియర్ గ్యాస్ తగలడంతో పంజాబ్ కు చెందిన 24 ఏళ్ల శుభ కరణ్ సింగ్ మరణించాడు. హర్యానా-పంజాబ్‌కు చెందిన కనౌరీ సరిహద్దులో ఈ ఘటన జరిగింది./p>

ఇప్పటికే రెండు వర్గాల మధ్య చాలాసార్లు చర్చలు జరిపింది. అయినా ఫలితం లేకపోయింది. రైతు నిరసనల కారణంగా దేశ సరిహ్దదు ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్రిబుల్ బొనంజా.. ఒకేసారి మూడు కీలక ప్రకటనలు..!

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News