ఇకపై కొత్త సిమ్ కార్డు కావాలంటే.. ఆధార్ ఒక్కటే సరిపోదు.. ఇది కావాల్సిందే!

ఇకపై కొత్త సిమ్ కార్డు కావాలంటే.. ఇది తప్పనిసరి!

Last Updated : Aug 25, 2018, 09:20 PM IST
ఇకపై కొత్త సిమ్ కార్డు కావాలంటే.. ఆధార్ ఒక్కటే సరిపోదు.. ఇది కావాల్సిందే!

కొత్తగా సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇకపై ఈ నింబంధన తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే నో సిమ్ కార్డ్ అంటోంది భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ). ఈమేరకు యూఐడీఏఐ నుంచి కొత్త టెలికాం సంస్థలకు కొత్త నిబంధనలు సైతం జారీ అయ్యాయి. కొత్త మొబైల్‌ సిమ్‌ కార్డు కోసం ఆధార్‌ కార్డుని అడ్రస్ ధృవీకరణ పత్రంగా జతచేసే వినియోగదారుల నుంచి వారి ఫేషియల్‌ రికగ్నిషన్‌, లైవ్‌ ఫొటో తప్పనిసరిగా తీసుకోవాలని యూఐడీఏఐ టెలికాం ఆపరేట్లకు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఒకరి ఆధార్‌ వివరాలతో మరొకరు సిమ్ కార్డు తీసుకునే ప్రమాదం ఉందని గుర్తించిన యూఐడీఏఐ, అలాంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే ఈ నిబంధనను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. 

భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ జారీ చేసిన ఈ ఆదేశాలు కేవలం సిమ్ కార్డు జారీకి మాత్రమే కాకుండా ఆధార్ కార్డుని ఉపయోగించి జరిపే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వ్యవహారాలకు ఈ నిబంధన వర్తించనుంది. సెప్టెంబరు 15 నుంచి దశలవారీగా ఈ నిబంధనలను అమలు చేయాలని పేర్కొన్న యూఐడీఏఐ.. ప్రతి నెలా జరిగే మొత్తం ధ్రువీకరణల్లో 10 శాతం ఫేషియల్‌ రికగ్నిషన్‌, లైవ్‌ ఫొటో ఆధారంగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. లేనిపక్షంలో నిబంధనలు పాటించని సదరు ఆపరేట్లు జరిమానా రూపంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని యూఐడీఏఐ స్పష్టంచేసింది.

Trending News