ఉత్కంఠ రేపుతున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక 

                     

Last Updated : Aug 8, 2018, 07:10 PM IST
ఉత్కంఠ రేపుతున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక 

ఢిల్లీ: కురియన్ పదవీకాలం ముగియడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి 9వ తేదీన ఎన్నికలు జరిపించేందుకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధికి పోటీగా కర్ణాటకకు చెందిన ఎంపీ బీకే హరిప్రసాద్ ను బరిలోకి నిలపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీల మద్దుతు కూడగడుతున్న కాంగ్రెస్ కు టీడీపీ, వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం గమనార్హం. బీఎస్పీ, ఎస్పీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్  తదితర ప్రాంతీయ పార్టీలు కూడా తమకు లభిస్తుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తే.. ఆ పార్టీకి చెందిన అభ్యర్ధి హరిప్రసాద్ విపక్ష పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగుతారు.
 
కాంగ్రెస్ అభ్యర్ధికి సపోర్టు చేసేందుకు టీడీపీతో పాటు ప్రాంతీయ పార్టీలు ముందుకు రావడం... రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికను సునాయసనంగా గెలుపొందాలనుకుంటున్న  బీజేపీకి షాకినట్లయింది. ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి  పూర్తి బలం లేకపోవడం ఆ పార్టీ అగ్రనేతలకు ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 245 మంది సభ్యులన్న రాజ్యసభలో మెజార్టీ దక్కాలంటే 123 ఓట్లు అవసరం. రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీయే బలం 89 మాత్రమే(వికిపీడియా లెక్క ప్రకారం).  ఎన్డీయేకు కొన్ని పార్టీలు బయటికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సరే ఆ పార్టీలు మద్దతు ఇచ్చినా ఎన్డీయే మద్దతు దారుల సంఖ్య 110కి మించి ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

తాజా పరిణామాల నేపథ్యంలో ఇతర ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేస్తేనే కానీ ఎన్డీయే గట్టెక్కలేని పరిస్థితి. ఒక వేళ ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేకు సపోర్ట్ చేయకపోయినా.. కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటే సరి.. ఎన్టీయే విజయం  సాధించే అవకాశముంది.. అయితే మిత్రపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలతో బద్ధవిరోధి వ్యతిరేకించే టీడీపీ లాంటి పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం లాంటి పరిణామాలు బీజేపీకి ఇబ్బందికరంగా పరిగణిస్తోంది. తాజా పరిణామాల  నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక అంశం ఉత్కంఠతకు దారి తీస్తోంది. 

Trending News