73 lakh People get EPFO Pension: పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త..త్వరలో 73 లక్షల మందికి ఒకేసారి పెన్షన్ జమ..!

EPFO: తన ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో(EPFO) గుడ్‌న్యూస్ చెప్పింది. పెన్షన్‌ దారులందరికీ ఒకేసారి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో ఆమోదం తెలపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Written by - Alla Swamy | Last Updated : Jul 14, 2022, 11:28 AM IST
  • పీఎఫ్ ఖాతారులకు శుభవార్త
  • ఒకేసారి పింఛన్ ఇచ్చే అవకాశం
  • త్వరలో కీలక నిర్ణయం
73 lakh People get EPFO Pension: పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త..త్వరలో 73 లక్షల మందికి ఒకేసారి పెన్షన్ జమ..!

EPFO: దేశవ్యాప్తంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO)లో పెన్షన్‌ దారులుగా నమోదు చేసుకున్న వారిని శుభవార్త అందింది. ఇకపై వారికి ఒకేసారి పెన్షన్‌ జమ కానుంది. ఈనెలాఖరున జరిగే సమావేశంలో ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకోనుంది. కేంద్రీకృత పెన్షన్‌ సరఫరా వ్యవస్థకు ఆమోదం తెలపనుంది. దీంతో దేశవ్యాప్తంగా 73 లక్షల మంది పెన్షన్‌ దారులకు ఒకేసారి పెన్షన్ డిపాజిట్ కానుంది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రాంతీయ ఈపీఎఫ్‌వో కార్యాలయాల్లో వేర్వేరు తేదీల్లో, ఒకే రోజు వేర్వేరు సమయాల్లో సొమ్ము డిపాజిట్ అవుతోంది. ఇప్పుడు కేంద్రీకృత పింఛన్‌ విధానానికి ఆమోదం తెలిపితే..ఒకేసారి పెన్షన్ డిపాజిట్ కానుంది. నకిలీ ఖాతాలు, నిరుపయోగం ఉన్న ఖాతాలను ఏరివేసేందుకు ఈస్కీమ్ ఉపయోగపడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

ఈసారి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల కంటే తక్కువ కాలంలో పీఎఫ్‌ ఖాతా యాక్టివ్‌గా ఉన్న వారికి కూడా పీఎఫ్ సొమ్ము తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆరు నెలల నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్న వారికి మాత్రమే పీఎఫ్ సొమ్ము వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.

Also read:Maharashtra: శివసేన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు..ఉద్దవ్ ఠాక్రేకు ఊరటనేనా..?

Also read:Adire Abhi: కిరాక్ ఆర్పీ కామెంట్స్ పై ఓపెన్ అయిన అదిరే అభి.. మొదటి నుంచి అంతే అంటూ!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News