/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

"మధ్య తరగతి వారికోసం ఇప్పటికే చాలా చేశాం" అని అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. "గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2018లో మధ్య తరగతి ప్రజానికం సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది" అని కేంద్రంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ మంత్రి అరుణ్ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి అరుణ్ జైట్లీ.. గత బడ్జెట్స్ లో మధ్య తరగతి ప్రజానికం కోసం కేంద్రం ఎంతో కృషి చేసిందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ద్రవ్య లోటు ప్రకారం భవిష్యత్‌లోనూ మధ్య తరగతి వారికి మరిన్ని అభివృద్ధి ఫలాలు అందించే ప్రయత్నం చేయనున్నట్టు మీడియాకు తెలిపారు. తాను ప్రవేశపెట్టిన గత నాలుగైదు బడ్జెట్స్ సగటు మొత్తాన్ని పరిశీలిస్తే, సామాన్యుడు, తక్కువ పన్ను పరిధిలోకి వచ్చే వారికి మేలు జరిగే విధంగానే ఆయా బడ్జెట్స్‌ని తీర్చిదిద్దడం జరిగిందనే విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు మంత్రి.

"దేశంలో భారీ స్థాయిలో మౌళిక వసతలు కల్పించాలన్నా, దేశ సరిహద్దులు, సామాజిక భద్రత జాతి ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది" అని తమ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు తేల్చిచెప్పారు మంత్రి అరుణ్ జైట్లీ. 

Section: 
English Title: 
Enough done to middle class in past union Budgets: Arun Jaitley
News Source: 
Home Title: 

మిడిల్ క్లాస్ వాళ్లకు ఇప్పటికే చాలా చేశాం

మిడిల్ క్లాస్ వాళ్లకు ఇప్పటికే చాలా చేశాం : అరుణ్ జైట్లీ
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes