Emergency Day: ఎమర్జన్సీకి 50 యేళ్లు.. దేశ ప్రజలపై ఇందిరమ్మ రుద్దిన చీకటి రోజులు..

Emergency Day: ప్రజాస్వామ్య పరంగా మనందరం హాయిగా ఊపరి పీల్చుకుంటున్నాము. ఎవరిని పడితే వారినీ ప్రధాని సహా అందరినీ ఏకి పారేసే స్వేచ్ఛను ప్రజలు అనుభవిస్తున్నారు. కానీ 50 యేళ్ల అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రశ్నించే దేశ ప్రజల గొంతును నొక్కేసింది. అత్యవసర పరిస్థితిని విధించింది. మొత్తంగా ప్రజలపై బలవంతంగా ఈ ఎమర్జన్సీని ఎందుకు రుద్దాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయానికొస్తే..

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 25, 2024, 04:45 AM IST
Emergency Day: ఎమర్జన్సీకి 50 యేళ్లు.. దేశ ప్రజలపై ఇందిరమ్మ రుద్దిన చీకటి రోజులు..

Emergency Day: దేశానికి వెన్నుముక అయిన ప్రజాస్వామ్యంలో ఎమర్జన్సీ ఓ చీకటి అధ్యాయం. ఏడో దశకం మధ్య భాగంలో దేశ ప్రజలపై విధించిన అత్యవసర పరిస్థితి అదో పీడ కల. నెహ్రూ కాలంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో కాస్త బలహీన పడింది. ఆయన మరణంతో ఏ మాత్రం పాలన అనుభవం లేని ఇందిరా గాంధీ  ప్రధాన మంత్రి అయ్యారు. అప్పట్లో కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఇందిరాను కీలు బొమ్మలా ఆడించి పరిపాలన చేసారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఇందిరా గాంధీ తనకంటూ ప్రత్యేక కోటరి ఏర్పాటు చేసుకుంది.  1971 ఎన్నికల్లో  ఇందిరా గాంధీ గరిబీ హఠావో నినాదంతో ఎన్నికల్లో గెలిచింది. ఆ సందర్భంగా ఇందిరా వర్గం ఆవు - దూడ గుర్తు  1971లో అనూహ్యంగా విజయం సాధించింది. దిమ్మ దిరిగిపోయిన అపోజిషన్ పార్టీలు ఏదో మోసం జరిగిందని ఆరోపించాయి.

అప్పట్లో జనసంఘ్ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ పూర్వ రూపం) జాతీయ అధ్యక్షుడు బలరాజ్ మధోక్  ఇందిరా గాంధీ అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగుల చేత రష్యా నుంచి కొనుగోలు చేసిన  రంగు ఇంకు వాడిందనే ఆరోపణలు చేసారు.  అప్పట్లో ఎవరు ఎవరికీ  ఓటేసిన మరుసటి రోజు వరకు అది మాసిపోయి.. ఇందిరా గాంధీ కాంగ్రెస్  పార్టీ గుర్తు అయిన ఆవు - దూడకే ఓటు పడేవన్నారు.  అప్పటి కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన కాడి జోడెద్దులు ఉండేది. 1971లో దెబ్బ తిన్న ప్రతిపక్ష పార్టీలు 1977 లో అనేక రాష్ట్రాల్లో ఇందిరా గాంధీ పార్టీని ఓడించారు. దీని వెనక పెద్ద రీజన్ ఎమర్జన్సీ.

ఈ ఎమర్జన్సీ ఇందిరా గాంధీని ఓడిపోయేలా చేసింది. 1971 పార్లమెంటు ఎన్నికల్లో రాయబరేలి నియోజకవర్గం నుంచి గెలిచిన ఇందిరా గాంధీకి అప్పట్లో 183309 ఓట్లు వచ్చాయి. ఆమెకు పోటీ నిలబడిన సోషలిస్టు పార్టీ లీడర్ రాజ్ నారాయణ్ కు 71449 ఓట్లు వచ్చాయి. ఓడిపోయిన ఆయన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కోర్టుకు ఎక్కాడు. కోర్డు కూడా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని నిగ్గుతేల్చింది. హైకోర్టు న్యాయమూర్తి జగ్‌మోహన్ లాల్ సిన్హా ఉత్తరప్రదేశ్ స్టేట్ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో తీర్పు నిచ్చింది. అంతేకాదు ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు నిచ్చింది. అంతేకాదు ఆమె ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ తీర్పు ఇచ్చింది. తీర్పు వెలుబడిన తర్వాతే ఇందిరా గాంధీ దేశ ప్రజలపై అత్యవసర పరిస్థితి విధించింది.

ఇందిరా తన ప్రధాని పదవికే ప్రమాదం ఏర్పడటంతో రాజ్యాంగంలో ఉన్న అంతర్గత భద్రత చట్టం ఆర్టికల్ 352 ప్రకారం.. జూన్ 25న అర్దరాత్రి క్యాబినేట్ ఆమోదంతో అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ దేశంలో అత్యయిక పరిస్థితిని  విధించారు. ఈ సందర్బంగా  దేశంలో  ఉన్న ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ చేసిన అరాచకాల అన్నీ ఇన్నీ కావు. ఆయన  చేసిన ఘోరాల గురించి ప్రతిపక్షాలు ఇప్పటికీ ప్రస్తావిస్తూనే ఉంటాయి. 25 జూన్ 1975లో ప్రారంభమైన ఎమర్జన్సీ.. 21 మార్చి 1977 వరకు 21 నెలలు పాటు  కొనసాగింది.

ఎమర్జీన్సీ ఎత్తివేసిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ తరుపున ఇందిరా గాంధీ పై పోటీ చేసిన రాజ్ నారాయణ్ అప్పట్లో ఇందిరా గాంధీని 55 వేలకు పైగా ఓట్లతో ఓటమి పాలు చేసారు. ఆ ఎన్నికల్లో రాజ్ నారాయణ్ కు 177719 ఓట్లు రాగా.. ఇందిరా గాంధీకి 122517 ఓట్లు వచ్చాయి. ఇందిరా గాంధీ తన జీవితంలో చవిచూసిన తొలి ఓటమి అదే. అప్పట్లో రాజ్ నారాయణ్ ను అందరు జెయింట్ కిల్లర్ గా అభివర్ణించారు. ఆ తర్వాత ఏర్పడిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఇందిరా గాంధీతో కలిసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీ రోల్ పోషించారు. ఆ తర్వాత చరణ్ సింగ్ ను ప్రధాని చేయడంలో కీ రోల్ పోషించారు. ఆ తర్వాత 1984 ఎన్నికల్లో చరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News