Child Rights: ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అడ్డదారులు తొక్కుతుంటాయి. వయసు తేడా లేకుండా పార్టీ కార్యక్రమాల్లో ప్రజలను తరలిస్తుంటాయి. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల్లో చిన్నారుల వినియోగిస్తున్నారు. ఈ వ్యవహారంపై బాలల హక్కుల కార్యకర్తలు, సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా దానికి అడ్డుకట్ట పట్టడం లేదు. తాజాగా ఈ విషయమై ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.
Also Read: Raw Cat Eat: దేశంలో ఇంకా ఆకలి కేకలా.. దేశాన్ని నివ్వెరపరిచిన 'పిల్లిని తిన్న యువకుడు' సంఘటన
దేశంలోని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక విధంగా హెచ్చరికలాంటిది చేసింది. రాజకీయ కార్యక్రమాల్లో చిన్నారులను ఉపయోగించవద్దని స్పష్టం చేసింది. ఇకపై పిల్లలను పార్టీ కార్యక్రమాల్లో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బాలకార్మిక చట్టాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ విషయంలో 'జీరో టాలరెన్స్' విధానం అమలుచేస్తామని ప్రకటించింది.
Also Read: UBI Recruitment: అదిరిపోయే ఉద్యోగం.. ఈ జాబ్‌కు ఎంపికైతే తొలి జీతమే రూ.90 వేలు
'రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. ఎన్నికల ర్యాలీలు, ప్రచార కార్యకలాపాల్లో పిల్లలను ఉపయోగించవద్దు. పోస్టర్లు, కరపత్రాల పంపిణీ, నినాదాలు, ప్రచార గీతాలు.. ఇలా ఏ విషయంలోనైనా.. ఏ పనిలోనైనా పిల్లలను వినియోగించొద్దు. అభిమానంతో.. ఫొటోలకు ఫోజులిచ్చేలా చిన్నారులను ఎత్తుకోవడం కూడా నిషేధమే. వారిని వాహనాల్లో తీసుకెళ్లడం కూడా నిషేధం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి' అని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎన్నికల విధుల్లో కూడా అధికారులు చిన్నారులను వినియోగించరాదని కూడా తెలిపింది. 'ఎన్నికల సంబంధిత పనులు, కార్యకలాపాల్లో చిన్నారులను చేర్చుకోవద్దు. బాల కార్మిక చట్టాలు, నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూసే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులదే. ఎన్నికల యంత్రాంగం ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు' అని ఈసీ స్పష్టం చేసింది.
ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ మేరకు పార్టీలు, అభ్యర్థులకు ఈ ఆదేశాలు ఇచ్చారు. బాల కార్మిక చట్టం-1986 (2016లో సవరణ) కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 2014లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఈసీ ప్రస్తావించింది. ప్రస్తుతం దేశంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి