J&K, Haryana Polls: దేశంలో మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. జమ్మూ కశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన విడుదల అయ్యింది. హర్యానాలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించనుండగా.. జమ్మూ కశ్మీర్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఒకే రోజు విడుదల చేయనున్నాయి. ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో ఆ రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయ సందడి ఏర్పడింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కశ్మీర్లో ఎన్నికలు జరుగుతుండడంతో అందరి దృష్టి ఈ ఎన్నికలపై పడింది.
Also Read: Rain Alert: తెలంగాణలో మళ్లీ జోరుగా వర్షాలు.. 3 రోజులు ఎక్కడెక్కడ కురుస్తాయో తెలుసా?
జమ్మూ కశ్మీర్లో..
ప్రత్యేక ప్రాతినిధ్య చట్టం 370 రద్దయిన తర్వాత కశ్మీర్, లడఖ్ ప్రాంతంగా విడిపోయింది. ఈ రెండూ ప్రాంతాల్లో కలిపి మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 21 స్థానాలకు సెప్టెంబర్ 14వ తేదీన, 26 స్థానాలకు సెప్టెంబర్ 25న, మిగిలిన 40 స్థానాలకు అక్టోబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4వ తేదీన విడుదల కానున్నాయి.
Also Read: Phenyl Pour: విచిత్ర సంఘటన.. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫినాయిల్‌తో అభిషేకం
హర్యానాలో ఒకే విడత
మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 1వ తేదీన ఒకే విడతన మొత్తం స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. జమ్ము కశ్మీర్‌తోపాటు అక్టోబర్ 4వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.
మహారాష్ట్ర ఆలస్యం?
గత మూడు పర్యాయాలు మహారాష్ట్రతో కలిపి హర్యానా ఎన్నికలు జరిగాయి. తాజా ఎన్నికల ప్రకటనలో మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఉంటాయని భావించారు. కానీ జమ్మూకశ్మీర్, హర్యానాకు సంబంధించిన ఎన్నికల ప్రకటన మాత్రమే విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ఎన్నికలు కొంత ఆలస్యంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతోపాటు రానున్న రోజుల్లో వినాయక చవితి, దసరా నవరాత్రులు, దీపావళి పండుగలు వరుసగా ఉన్నాయి. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం కొంత కష్టతరం కావడంతో మహారాష్ట్ర ఎన్నికలు ఆలస్యంగా నిర్వహించాలని భావించినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీతోపాటు మహారాష్ట్ర ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter