ECIL Jobs 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ECIL Jobs 2020 | ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) కాంట్రాక్ట్ విధానంలో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ ఉద్యోగాలను 2 ఏళ్లకు ఒప్పంద ప్రాతిపదికన (ECIL Recruitment 2020) భర్తీ చేయనున్నట్లు ఈసీఐఎల్‌ వెల్లడించింది.

Last Updated : Oct 22, 2020, 04:12 PM IST
ECIL Jobs 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ECIL Jobs 2020 | హైద‌రాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) కాంట్రాక్ట్ విధానంలో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా టెక్నికల్ పోస్టులు, సైంటిఫిక్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు సహా మొత్తం 65 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను 2 ఏళ్లకు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ఈసీఐఎల్‌ వెల్లడించింది. తగిన అర్హతలు, అనుభవం ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఈ పోస్టులు అన్నింటికి ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
1) టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌: 24 పోస్టులు
60 శాతం మార్కులతో ఇంజినీరింగ్  పూర్తి కావాలి. కనీసం ఏడాది అనుభవం ఉన్నవారు అర్హులు.
ఈ సెప్టెంబర్ 30 నాటికి (30-09-2020) 30 సంవత్సరాలలోపు ఉండాలి.
వేతనం: రూ. 23,000 నెలకు.

2) సైంటిఫిక్ అసిస్టెంట్‌: 13 పోస్టులు
60 శాతం మార్కులతో డిప్లొమా పూర్తి కావాలి. ఏడాది అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ సెప్టెంబర్ 30 నాటికి (30-09-2020) 25 సంవత్సరాలలోపు ఉంటే వయపరిమితి (Age Limit) సరిపోతుంది
వేతనం: రూ.19,864 నెలకు.    Also Read : SBI Clerk Prelims Result 2020: ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

3) జూనియ‌ర్ ఆర్టిజ‌న్‌: 28 పోస్టులు
ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. కనీసం ఏడాది అయినా పనిచేసిన అనుభవం ఉండాలి.
ఈ సెప్టెంబర్ 30 నాటికి (30-09-2020) 25 సంవత్సరాలలోపు ఉండాలి.
వేతనం: రూ.18,070 నెలకు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

ఈసీఐఎల్ వెబ్‌సైట్ (ECIL Official Website)
ఎంపిక విధానం (Selection Process): షార్ట్‌లిస్టింగ్‌, వ‌ర్చువ‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
దరఖాస్తుకు చివరితేది: 02.11.2020 (ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News