Earthquake hits Delhi Nearby Areas: దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తంచారు.
ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలైన చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్ మరియు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంపం ధాటికి రాజధానితోపాటు నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ మరియు గురుగ్రామ్ వంటి నగరాలు వణికాయి. ఈ భూకంపం ధాటికి ఇళ్లు, ఆఫీసులు నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనలకు ఇళ్లలోని ఫ్యాన్లు, ఇతర వస్తువులు ఊగిపోయాయి. దీనికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రాణ, ఆస్తినష్టం గురించి ఎటువంటి సమాచారం అందలేదు.
పొరుగు దేశం పాకిస్థాన్ పై కూడా దీని ప్రభావం పడింది. మధ్యాహ్నం 2.20 గంటలకు పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ముఖ్యంగా లాహోర్, ఇస్లామాబాద్ మరియు ఖైబర్ పఖ్తుంక్వా నగరాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది, భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌కు ఉత్తర-ఈశాన్యంగా 241 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్ర ఉన్నట్లు మరో వార్తా సంస్థ పేర్కొంది.
Earthquake of magnitude 6.1 on Richter scale hits Afghanistan, tremors felt in North India pic.twitter.com/P3wHPxnVYg
— ANI (@ANI) January 11, 2024
Also Read: Ayodhya Ram Mandir Video: అయోధ్య రామమందిరం వాట్సాప్ స్టేటస్ వీడియో..
Also Read:Ayodhya Pran prathishtha: అయోధ్యలో ఇకపై ప్రతి యేటా ప్రాణ ప్రతిష్ఠ, నో నాన్ వెజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook