Lieutenant General: ఇండియన్ ఆర్మీలో ఆ మహిళకు అరుదైన గౌరవం

భారత ఆర్మీలో ( Indian army ) ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. డాక్టర్ మాధురి కనిత్కర్ ( Dr madhuri kanitkar ) కు లెఫ్టినెంట్ జనరల్ గా పదోన్నతి లభించింది. త్రీ స్టార్ ర్యాంక్ పొందిన మూడవ మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు.

Last Updated : Aug 26, 2020, 10:32 PM IST
Lieutenant General: ఇండియన్ ఆర్మీలో ఆ మహిళకు అరుదైన గౌరవం

భారత ఆర్మీలో ( Indian army ) ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. డాక్టర్ మాధురి కనిత్కర్ ( Dr madhuri kanitkar ) కు లెఫ్టినెంట్ జనరల్ గా పదోన్నతి లభించింది. త్రీ స్టార్ ర్యాంక్ పొందిన మూడవ మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు.

ధార్వాడ్ లో జన్మించిన డాక్టర్ మాధురి కనిత్కర్ కు ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ ( Lieutenant general ) గా పదోన్నతి లభించింది. దీంతో ఇండియన్ ఆర్మీ ( Indian army ) లో ఈ గౌరవం దక్కించుకున్న మూడవ మహిళగా నిలిచారు. 37 ఏళ్లుగా ఆర్మీలో సేవలందిస్తున్న డాక్టర్ మాధురి కనిత్కర్..లెఫ్టినెంట్ జనరల్ పునితా అరోరా, ఎయిర్ మార్షల్ పద్మ బందోపాధ్యాయ తరువాత ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. గతంలో పూణేలోని ఆర్మీ మెడికల్ కళాశాల ( Army medical college ) డీన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మెడికల్ కు ఛీఫ్ గా ఉన్నారు. త్రీ స్టార్స్ పొందిన మూడవ మహిళగా..భర్తతో పాటు సమానంగా త్రీ స్టార్ పొందిన తొలి మహిళగా ఖ్యాతి గాంచారు డాక్టర్ మాధురి. ప్రధానమంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ లో ఈమె ఏకైక డాక్టర్  గా కూడా ఉన్నారు. 

కలల్ని సాకారం చేసుకోవడంలో జెండర్ ( Gender never been an obstacle ) అనేది ఎప్పుడూ అడ్డంకి కాలేదంటున్నారు డాక్టర్ మాధురి కనిత్కర్. తన తల్లిదండ్రులు, టీచర్లు కూడా అలా ఎప్పుడూ భావించలేదన్నారు. ఏదీ అసాద్యం కాదని తనకు తన ఇద్దరు చెల్లెల్లకు తల్లిదండ్రులు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. Also read: Terror Attack: దేశంలో ఉగ్రదాడులకు కుట్ర

Trending News