బీజేపీ 55 సీట్లు నెగ్గుతుంది!: మనోజ్ తివారీ

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ధీమాగా ఉంది. తమ పార్టీదే విజయమని, బీజేపీ 55 స్థానాల్లో విజయం సాధించినా ఆశ్చర్యం అక్కర్లేదని మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు.

Last Updated : Feb 11, 2020, 08:38 AM IST
బీజేపీ 55 సీట్లు నెగ్గుతుంది!: మనోజ్ తివారీ

న్యూఢిల్లీ: మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఢిల్లీ నేతల భవితవ్యం తేలనుంది. ఓటింగ్ ప్రారంభానికి ముందు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం మూడింట రెండొంతుల సీట్లను అధికార ఆప్ కైవసం చేసుకోనుందని స్పష్టం చేశాయి. మరోవైపు కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశాలే లేవని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ధీమా వ్యక్తం చేశారు. తానేమీ ఒత్తిడికి గురికావడం లేదన్నారు. ఈరోజు బీజేపీకి మంచి జరిగేరోజు అని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నేడు తాము అధికారంలోకి రాబోతున్నామని వ్యాఖ్యానించారు. బీజేపీ 55 సీట్లు నెగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదందూ తమ పార్టీ విజయంపై మనోజ్ తివారీ జోస్యం చెప్పారు. ఫలితాల కోసం కొన్ని గంటలు వేచి చూడాలి.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల కథనాల కోసం క్లిక్ చేయండి

కాగా, ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా, నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. మొత్తం 21 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి రణ్‌బీర్ సింగ్ చెప్పారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News