Puja for Dogs in Temple: హిందూ ధర్మంలో ఎన్నో చిత్ర విచిత్రమైన విశేషాలు ఉంటాయి. హిందూ దేవుళ్లను ఒకొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా పూజిస్తూ ఉంటారు. ఎవరికి వారే అన్నట్లుగా దేవుళ్ల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తమ తమ ఆరాధ్య దైవాలను వేరు వేరు రూపాల్లో కొలుస్తూ ఉంటారు. పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ అవతారంగా కాలభైరవుడిని భావిస్తూ ఉంటారు.
బ్రహ్మ విష్ణువుల యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికి స్వయంగా పరమేశ్వరుడు మరో రూపంగా అవతరించిన దైవ స్వరూపం కాల భైరవుడు. ఎన్నో గ్రహాల కారణంగా పీడింపబడుతున్న వారిని రక్షించేందుకు కాల భైరవుడు అవతరించారని కూడా అంటూ ఉంటారు. శివుడి యొక్క అత్యంత రౌద్ర రూపాల్లో కాల భైరవుడి రూపం ఒకటిగా హిందూ పురాణాలు చెబుతున్నాయి.
కాల భైరవుడికి దేశ వ్యాప్తంగా పలు దేవాలయాలు.. పీఠాలు ఉన్నాయి. కర్ణాటకలోని కాల భైరవుడి ఆలయం ప్రముఖమైనది. కాల భైరవుడి సన్నిధి ఆది చూచనగిరి మఠం ఒకటి. ఈ ఆలయంలో కాల భైరవుడి యొక్క వాహనంగా పేర్కొనే కుక్కలకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉంటారు.
ప్రతి రోజు ఉదయం మరియు రాత్రి సమయంలో కాలభైరవ దేవాలయంలో కుక్కలకు పూజలు నిర్వహించడం సుదీర్ఘ కాలంగా ఆనవాయితీగా వస్తోంది. దేశంలో కుక్కలకు ప్రత్యేక పూజలు చేసేది ఆ ఒక్క దేవాలయంలో మాత్రమే. కాల భైరవుడి యొక్క వాహనంగా అందరు పిలుస్తారు కానీ ప్రత్యేకంగా పూజలు మాత్రం ఆదిచూచనగిరి మఠంలో మాత్రమే జరుగుతాయి.
Also Read: TS SSC Results 2023: పది ఫలితాలు వచ్చేశాయి..రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రస్తుతం ఈ మఠానికి శ్రీశ్రీ నిర్మలానందనాథ్ స్వామిజీ మఠాధిపతిగా ఉన్నారు. 1974 నుండి 2013 వరకు చంచనగిరిమఠానికి బాలగంగాధర నాథ స్వామీజి ఆధ్వర్యంలో సాగింది. ఈ మఠంను జ్వాలా పీఠం అని కూడా పిలుస్తారు. శివుడి యొక్క తపస్సు కోసం కూర్చున్న పవిత్ర స్థలం అవ్వడం వల్ల అతడి తేజస్సు నిండి ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని అగ్ని పీఠం అని కూడా పిలుస్తూ ఉంటారు.
స్వయంగా ఈశ్వరుడు నెలకొల్పిన పీఠాల్లో ఇది ఒకటి అంటూ స్థల పురాణం చెబుతోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి ఈ దేవాలయానికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పీఠంలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి