Governor Dispute: రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ మధ్య ఘర్షణ పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో విభిన్న ప్రభుత్వాలున్నప్పుడు ఈ ఘర్షణ అనివార్యమౌతోంది. ఎవరిది పైచేయి..నిన్న తెలంగాణ అయితే ఇప్పుడు తమిళనాడు.
కేంద్ర, రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలున్నప్పుడు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు మాట విననప్పుడు..చేతికి ఆయుధంలా ఉపయోగపడేది, రాష్ట్ర ప్రభుత్వాల్ని చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పెట్టేంది గవర్నర్ వ్యవస్థ. గవర్నర్ వ్యవస్థ స్టాంప్ లాంటిదేనైనా..ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టందుకు పనిచేస్తుంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. నిన్న తెలంగాణ అయితే..నేడు తమిళనాడు. గవర్నర్‌తో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సై అంటున్నారు. ఈ నేపధ్యంలో గవర్నర్ వ్యవస్థ నేపధ్యం గురించి ముందుగా తెలుసుకుందాం..
గవర్నర్ వ్యవస్థ నేపధ్యం, అధికారాలు
గవర్నర్ వ్యవస్థ అనేది స్వాతంత్యానికి పూర్వం అంటే బ్రిటీషు పాలన నుంచి ఉన్నది. అప్పట్లో వైశ్రాయ్ అనేది కీలకమైన పదవి. గవర్నర్ అనేది కార్య నిర్వాహక అధిపతి. బ్రిటీషు చట్టాలకు అనుగుణంగా నాడు ఏర్పడిన ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఓ గవర్నర్ అవసరం. ఆర్టికల్ 154 ప్రకారం కార్యనిర్వాహక అధికారముంటుంది. పరోక్షంగా అధికారుల ద్వారా పరిపాలన చేయవచ్చనేది దీనర్ధం. సెక్షన్ 159 ప్రకాకరం ప్రమాణ స్వీకారం చేయించే అధికారముంటుంది. పేరుకు కార్య నిర్వాహక అధికారి అయినా..వాస్తవాధికారం మాత్రం మంత్రివర్గానిదే. తిరిగి అదే మంత్రివర్గానికి శాఖల కేటాయింపును ముఖ్యమంత్రి సూచన మేరకు చేసేది కూడా గవర్నరే.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్ వ్వవస్థ వారధిలా ఉండాలనే ఉద్దేశ్యంతో కొనసాగిస్తున్నారు. కానీ ఇదే గవర్నర్ వ్యవస్థను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించిన సందర్భాలున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఓ బిల్లును ఆమోదించినప్పుడు స్పష్టత కోరే అధికారం గవర్నర్‌కు ఉంది. అయినా ఆ బిల్లును అమలు చేసే అంతిమ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే.
తమిళనాడులో వివాదమేంటి
నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ రని వెనక్కి పంపించడంతో వివాదం ప్రారంభమైంది. గవర్నర్ వైఖరిని సవాలు చేస్తూ మరో కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. యూనివర్శిటీల్లో వైస్ ఛైన్సలర్ల నియామకాన్ని ప్రభుత్వమే చేపట్టేలా కొత్త తీర్మానమది. ఈ విషయంలో గవర్నర్ అధికారాల్ని తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు ఆ అధికారం ఎందుకుండకూడదనేది డీఎంకే వాదన. గవర్నర్ల గుత్తాధిపత్యాన్ని సహించేది లేదంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. 2010లో మాజీ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ మదన్ మోహన్ పూంఛీ నేతృత్వంలోని కమీషన్ కూడా...యూనివర్శిటీ ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్‌ను తొలగించాలని సిఫారుసు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా స్టాలిన్ గుర్తు చేశారు. ఈ నేపధ్యంలోనే తమిళనాడులో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదం పెరిగి పెద్దదవుతోంది.
తెలంగాణలో వివాదం
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కేటాయింపు ప్రతిపాదనను తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ తిరస్కరించడంతో వివాదం ప్రారంభమైంది. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సంబంధాలు దూరమయ్యాయి. అటు ప్రభుత్వం కూడా గవర్నర్ ప్రోటోకాల్ పక్కనబెట్టేసింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని తొలగించింది ప్రభుత్వం. అటు ప్రభుత్వ వైఖరిని నిరసనగా గవర్నర్ కూడా కాళోజీ హెల్త్ వర్శిటీ మెడికల్ సీట్ల వ్యవహారంపై సీరియస్ అవడం నివేదిక కోరడం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో జరిగిన వరుస 2-3 ఆత్మహత్యలపై నివేదిక కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిస్థితి దాటిపోతున్నాయని కేంద్రానికి నివేదించినట్టు కూడా తెలుస్తోంది.
ఈ వివాదాల నేపధ్యంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చందూ సంచలన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. గవర్నర పదవి అనవసరమైందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లుల్ని గవర్నర్ పెండింగులో పెట్టడం ఏ మేరకు సమంజసమనేది జస్టిస్ చందూ వాదన. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు గవర్నర్ వ్యవస్థ అవసరమా అని ప్రశ్నించారు.
Also read: YouTube Channels Banned: తప్పుడు వార్తల ప్రసారం.. 16 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.