Telangana Elections: లగడపాటి సర్వే Vs ఎగ్జిట్ పోల్స్ : ఇందులో ఏది నిజం ?

 భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ లో మనం ఎవరిని నమ్మాలో తెలంగాణలో చర్చ జరుగుతోంది.

Last Updated : Dec 8, 2018, 11:41 AM IST
Telangana Elections: లగడపాటి సర్వే Vs ఎగ్జిట్ పోల్స్ : ఇందులో ఏది నిజం ?

దిగ్గజ జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్నీ తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం.. కేసీఆర్ సీఎం అవడం తథ్యం అని బల్లగుద్దిచెబుతున్నాయి.. ఈ ఫలితాలతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగితేలాయి.. ఇంతలో గులాబీ పార్టీకి పిడుగు లాంటి చేదు వార్త వినాల్సి వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త అని ఉత్కంఠంగా ఉంది కదూ.. వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది

టీఆర్ఎస్ గెలస్తుందని కోడై కూసిన జాతీయ మీడియా

మొత్తం 119 స్థానాలున్న తెలంగాణలో 60 మ్యాజిక్ ఫిగర్. కాగా పోలింగ్ ముగిసిన తర్వాత వెనువెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించారు. జాతీయ మీడియా సంస్థలకు చెందిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ మళ్లీ అధికారం కైవసం చేసుకుంటుందని చెబుతున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ 66 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ జోస్యం చెప్పింది. ఇండియా టూడే  అయితే ఏకంగా టీఆర్ఎస్ కు 79 -91 సీట్లు వస్తాయని చెప్పింది. సీఎన్ఎస్ న్యూస్ టీఆర్ఎస్ కు  50 -65 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఎక్సిస్ ఎగ్జిట్ పోల్ అయితే టీఆర్ఎస్ 85 స్థానాలు సాధించి పక్కాగా అధికారం కైవసం చేసుకుంటుందని ప్రకటించింది.

కేసీఆర్ ఓటమి ఖామంటున్న లగడపాటి సర్వే 

జాతీయ మీడియా ఎగ్టిజ్ పోల్స్ అన్ని టీఆర్ఎస్ గెలుస్తుందన్న తరుణంలో అందుకు భిన్నమైన ఫలితాలను లగడపాటి సర్వే లో కనిపించాయి. జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలు విడుదల అనంతరం ప్రకటించిన లగడపాటి సర్వే ఫలితాల్లో ప్రజాకూటమి 65 స్థానాలతో విజయఢంకా మ్రోగిస్తుందని పేర్కొంది. అధికార పార్టీ టీఆర్ఎస్ 35 స్థానాలకు పరిమితమౌతుందని లగడపాటి జోస్యం చెప్పారు.

ఇందులో ఏది నిజం..ఏది అబద్ధం ?

ఒకవైపు ప్రజాభిప్రాయాన్ని అంచనావేయడంలో విశేష అనుభవం ఉన్న మీడియా సంస్థలు..మరోవైపు ప్రజల నాడి కచ్చితంగా పసిగట్టగలిగే ఆక్టోపస్ గా లగడపాటికి పేరుంది. దీంతో ఎవరి ఫలితాలు నమ్మాలో అర్థంకానీ పరిస్థితి ఏర్పడింది. నేతలైతే ఇప్పుడు నవ్వాలో ఏడ్వాలో అర్థంకాక డైలమాలో ఉండిపోయారు. ఇందులో ఏది నిజమౌతుందనే దానిపై జనాల్లో కూడా ఉత్కంఠత నెలకొంది. ఇది తేలాలంటే 11న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచిచూడాల్సిందే మరి..

Trending News