Dengue in Delhi: దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు డెంగ్యూ వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి. కరోనా కారణంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్న దేశ రాజధాని ఢిల్లీకు ఇప్పుడు డెంగ్యూ రూపంలో మరో ముప్పు వెన్నాడుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) పంజా విసురుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా 2 లక్షల 95 వేల కేసులు నమోదయ్యాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య రోజుకు 25 వేలకు చేరుకోవడంతో అప్రమత్తమైన ప్రభుత్వం వారం రోజుల పాటు లాక్‌డౌన్ (Lockdown) విధించింది. మరోవైపు ఢిల్లీకు డెంగ్యూ (Dengue )రూపంలో మరో ముప్పు వెంటాడుతోంది. దోమకాటు కారణంగా వచ్చే డెంగ్యూ వైరల్ జ్వరాల కేసులు ఢిల్లీలో పెరగడం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడేళ్ల రికార్డును డెంగ్యూ బద్దలు కొట్టింది. జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ మధ్య నమోదైన డెంగ్యూ కేసులు (Dengue cases) 2018 నుండి వస్తున్న కేసులను అధిగమించాయి. అధికారిక గణాంకాల ప్రకారం గత వారం కొత్తగా నలుగురు డెంగ్యూ రోగులతో మొత్తం రోగుల సంఖ్య 13కి చేరుకుంది. అయితే జనవరి 1 నుంచి ఏప్రిల్ 17 మధ్య సమయంలో 2017 సంవత్సరంలో 18 మంది, 2018 సంవత్సరంలో 12 మంది, 2019 లో 8 మంది, 2020 లో 7 గురు డెంగ్యూ రోగులను గుర్తించారు. అధికార గణాంకాల ప్రకారం మొత్తం 13 మంది డెంగ్యూ రోగుల్లో నలుగురు సౌత్ ఢిల్లీ కార్పోరేషన్ పరిధికి చెందిన వారుగా గుర్తించారు.
అదే సమయంలో, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన 22మంది రోగులు డెంగ్యూ చికిత్స పొందుతున్నారు. అయితే డెంగ్యూ అనేది నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్ లేని వైరల్ వ్యాధి కాబట్టి ప్రతీ ఒక్కరు దోమలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధిని కలిగి ఉన్న దోమలు ( Mosquito) ముఖ్యంగా పట్టణ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయని, వాటి పరిధి సమశీతోష్ణ ప్రాంతాల వైపు ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు సైతం తెలిపారు. సాయంత్రం పూట ఇంటి తలుపులు , కిటికీలు మూసి ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Also read: Corona Second Wave: ఇండియాలో ప్రమాదకర స్థాయి దాటేసిన కరోనా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook