Delhi: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. జూలో ఎంజాయ్ చేస్తుండగా ఊహించని పరిణామం.. అసలేం జరిగిందంటే..?

Couple Died: అభిషేక్,  అంజలి సరదాగా ఎంజాయ్ చేయడానికి జూకు వెళ్లారు. వీరికి గతేడాది నవంబర్ 30 న పెళ్లిజరిగింది. ఎక్కడికెళ్లిన కూడా ఇద్దరు కలిసే ఉండేవారు. కానీ సోమవారం వీరు ఢిల్లీలోని జూకు వెళ్లినప్పుడు మాత్రం అనుకొని ఘటన జరిగింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 27, 2024, 06:28 PM IST
  • సరదాగా ఎంజాయ్ చేయడానికి జూకు వెళ్లిన దంపతులు..
  • అందరి ముందే కిందపడిపోయిన యువకుడు..
Delhi: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. జూలో ఎంజాయ్ చేస్తుండగా ఊహించని పరిణామం.. అసలేం జరిగిందంటే..?

Abhishek Died Of Heart Attack In Delhi Zoo: న్యూఢిల్లీలోని ఘజియాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక యువ జంట సోమవారంరోజున జూ సందర్శనకు వెళ్లారు. అభిషేక్,  అంజలి ఇద్దరు కూడా చాలా సేపు జంతువులను చూస్తు ఎంజాయ్ చేశారు. చక్కగా కబుర్లు చెప్పుకున్నారు.   స్నాక్స్ తింటు సరదాగా గడిపారు. ఈక్రమంలో ఒక్కసారిగా, 25 ఏళ్ల అభిషేక్ అహ్లువాలి గుండెలో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు.

Read More: Pregnant Womans: సమ్మర్ లో ప్రెగ్నెంట్ లేడీస్ ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. నిపుణుల సూచనలివే..

వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. బాధిత యువకుడిని మొదట గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రాథమికంగా వైద్యం అందించి,  ఆపై సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈక్రమంలో..  అభిషేక్ ను వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో పల్స్ రేటు పడిపోయి.. అదేరోజు రాత్రి అభిషేక్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

యువకుడి మరణానికి గుండెపోటు కారణమని వైద్యులు గుర్తించారు. ఇదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఘజియాబాద్‌లోని వైశాలిలోని అహ్ల్కాన్ అపార్ట్‌మెంట్‌లోని కొత్త జంట ఇంటికి అతని మృతదేహం చేరుకుంది.  భర్త అకాల మరణంతో యువతి షాక్ కుగురైంది. ఈ క్రమంలో బాధను దిగమింగుకోలేక.. ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకుంది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను వైశాలిలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు.

Read More: Actress Riya Suman: వైట్ డ్రెస్ లో అందాల బ్లాస్ట్ చేసిన నాని హీరోయిన్, పిక్స్ వైరల్

అంజలి చికిత్స పొందుతూ.. ఈరోజు మంగళ వారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచింది. అభిషేక్ బంధువు బబిత మాట్లాడుతూ.. అభిషేక్... శవాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పక్కనే కూర్చొని ఏడ్చింది.. వెంటనే లేచి బాల్కనీ వైపు పరుగెత్తింది.. దూకబోతోందని భావించాను.. ఆమె వెంటే పరుగెత్తాను.. ఆమెను ఆపండి, అనే లోగ ఆమె దూకేసిందని కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఒకే కుటుంబంలో కుమారుడు,  కోడలు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన తీవ్ర విషాదకరంగా మారింది. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News