Delhi Liquor Scam: అసలు దిల్లీ లిక్కర్ స్కామ్ స్టోరీ ఏంటి.. ? కేజ్రీవాల్ అరెస్ట్‌తో బయటకు వస్తోన్న సంచలన నిజాలు..Part 2

Aravind Kejriwal Arrest: నూత‌న మ‌ద్యం విధానంలో ఎవ‌రు లాభ‌ప‌డ్డారు. ఎక్క‌డ నుంచి ఎక్క‌డికి సొమ్ములు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాయి. అందులో క‌విత అరెస్ట్ తర్వాత‌.. అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వెన‌క ఏం జ‌రిగింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 22, 2024, 11:53 AM IST
Delhi Liquor Scam: అసలు దిల్లీ లిక్కర్ స్కామ్ స్టోరీ ఏంటి.. ? కేజ్రీవాల్ అరెస్ట్‌తో బయటకు వస్తోన్న సంచలన  నిజాలు..Part 2

What is Delhi Liquor Scam: న్యూ లిక్కర్ పాలసీ విధారంగా ఎన్నో చట్టవిరుద్ధమైన ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని ..ప్రభుత్వ ఆదాయినికి గండిపడేలా..  ప్రైవేటు లైసెన్స్ దారులకు లబ్ది చేకూర్చేలా ఈ మద్యం పాలసీ విధానం ఉందని స్పష్టం చేస్తూ 2022 జూలెలో అప్పటి దిల్లీ ఛీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ ఓ నివేదికను విడుదల చేశారు. మరోవైపు కరోనా సమయంలో ప్రైవేటు వ్యాపారస్థులకు ప్రభుత్వం రూ. 144 కోట్ల మేర లైసెన్స్ ఫీజు మినహాయింపు ఇచ్చిందని ఈ నివేదికలో వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికపై డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ విచారణ చేయాలంటూ సిఫారసు చేసారు. తమ ప్రభుత్వం పై వస్తున్న ఆరోపణలను కేజ్రీవాల్ సహా వాళ్ల నేతలు కొట్టిపారుశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే దిల్లీ న్యూ ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

దిల్లీ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని వెనక్కి తీసుకోవడంతో దిల్లీలో 400కు పైగా మద్యం షాపులు మూత పడ్డాయి. దీంతో లిక్కరు షాపులు మళ్లీ గవర్నమెంట్ అండర్ టేకింగ్‌లోకి వెళ్లాయి. అప్పటి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు సీబీఐ విచారణ ప్రారంభించింది. ఆ తర్వాత 2022 ఆగష్టులో దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటితో పాటు కార్యాలయాలు సహా 31 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్‌లో సీబీఐకు ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు మనీష్‌ సిసోడియా. ఈ సందర్భంగా మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. తమ పార్టీని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా దిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీ లాండరింగ్ కూడా జరిగినట్టు ఈడీ గుర్తించింది. మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ దాఖుల చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అంతేకాదు ప్రత్యేక దర్యాప్తు చేపట్టే ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ కేసులో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కవిత నేతృత్వంలోని సౌత్ గ్రూపుకు లాభం చూకూర్చేందుకే కొత్త లిక్కర్ పాలసీని అరవింద్ కేజ్రీవాల్ రెడీ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన ఇన్వెస్టిగేషన్‌లో ఆధారాలు సంపాదించింది. ఈ కొత్త మద్యం పాలసీ ఆధారంగా సౌత్ గ్రూపుకు ఎక్కువ లైసెన్సులు దక్కినట్టు గుర్తించారు.

తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీని రెడీ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూపు రూ. 100 కోట్ల లంచం ఇచ్చినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరఏట్ గుర్తించింది. ఇలా వచ్చిన డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్టు తమ దర్యాప్తులో తెలియజేసింది. ఇలా దిల్లీ మద్యం వ్యాపారం ద్వారా సౌత్ గ్రూపుకు రూ. 100 కోట్లు రాబట్టుకున్నట్టు ఈడీ తన నివేదికలో పేర్కొంది. ఈ కొత్త మద్యం విధానం వల్ల ప్రభుత్వ ఆదాయానికి దాదాపు 2800 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఈడీ తేల్చేసింది.

దిల్లీ మద్యం స్కామ్‌ కేసులో అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రు, పి శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాఉ, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్రా, మాగుంట రాఘవ, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. వీరిలో అరుణ్ పిళ్లై, మనీష్‌ సిసోడియా, సంజయ్ సింగ్‌ జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అటు కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా, మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారారు. ఈకేసులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని సీబీఐ విచారించింది. తాజాగా ఈ కేసులో మెయిన్ తలకాయ అయిన అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను చేసింది. ఈయన అరెస్ట్‌తో దిల్లీ రాజకీయాలు ఏ విధమైన మలుపులు తిరుగుతాయో చూడాలి.

Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News