No lockdown in Delhi : ఢిల్లీలో లాక్‌డౌన్‌ ఉండదు కానీ వాటన్నింటిపై నిషేధం

Delhi Disaster Management Authority's meeting, No lockdown in Delhi : కోవిడ్‌ పరిస్థితులపై ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా సమావేశమైంది. ఢిల్లీలో లాక్‌డౌన్‌ ఉండదు కానీ.. రెస్టారెంట్లలో డైన్‌ ఇన్‌ సదుపాయంపై నిషేధం విధించాలని డిసైడ్ అయ్యారు. అలాగే డీడీఎంఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 05:40 PM IST
  • కోవిడ్‌ పరిస్థితులపై ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సమావేశం,
  • ఢిల్లీలో నో లాక్‌డౌన్‌...
  • రెస్టారంట్లలో డైన్‌ ఇన్‌ సదుపాయంపై నిషేధం
No lockdown in Delhi : ఢిల్లీలో లాక్‌డౌన్‌ ఉండదు కానీ వాటన్నింటిపై నిషేధం

Delhi Disaster Management Authority's meeting on amid Covid surge DDMA mulls stricter Covid curbs No lockdown in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) కరోనా (Corona) బీభత్సం సృష్టిస్తోంది. అక్కడ కోవిడ్ విజృంభిస్తోంది. కోవిడ్‌ వ్యాప్తిని కట్టడికి ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. (Delhi Government) తాజాగా మరికొన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది ఢిల్లీ సర్కార్.

కోవిడ్ (Covid) పరిస్థితులపై ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ - డీడీఎంఏ (Delhi Disaster Management Authority) సమావేశమైంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌తో (Lieutenant Governor Anil Baijal) పాటు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఈ మీటింగ్‌కు హాజరయ్యారు.

కోవిడ్‌ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.ప్రస్తుతానికి ఢిల్లీలో లాక్‌డౌన్‌ (lockdown) అవసరం లేదని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే మరికొన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. 

ఇందులో భాగంగా రెస్టారంట్లలో డైన్‌ ఇన్‌ సదుపాయాన్ని నిషేధించనున్నారని (closing dine-in facility) పీటీఐ పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, హోటళ్లు, రెస్టారెంట్లను 50 శాతం సామర్థ్యంతో నడుపుకోవచ్చు. అయితే రెస్టారెంట్స్‌లో (Restaurants‌) కూర్చుని తినే సదుపాయాన్ని నిషేధించాలని తాజా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారట. ఇక బస్సులు, మెట్రోల్లో (metro) కూడా సామర్థ్యాన్ని తగ్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Also Read : Antigen Test Kit Procedure: కరోనా లక్షణాలతో బాధపడుతున్నారా? ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోండిలా!  

ఇక ఢిల్లీలో కోవిడ్ కేసులు (Covid cases in Delhi) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దాదాపు వెయ్యి మందికి పోలీసులు (Police) కోవిడ్ బారినపడ్డారు. అలాగే పార్లమెంట్, సుప్రీం కోర్టు సిబ్బందిలో చాలా మంది కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఇక నిన్న ఒక్క రోజే 22,715 మంది కోవిడ్ బారినపడ్డారు. అలాగే నిన్న ఢిల్లీలో (Delhi) 17 మంది కోవిడ్‌తో చనిపోయారు.

Also Read : RGV vs Perni Nani: సినిమా టికెట్ల అంశంపై మంత్రి పేర్ని నానితో ముగిసిన ఆర్జీవీ భేటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News