Delhi Lockdown: ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు, ఇవాళ కేజ్రీవాల్ తుది నిర్ణయం

Delhi Lockdown: మొత్తం దేశాన్ని విలవిలలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయినా సరే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్రమణ ఆగకపోవడంతో లాక్‌డౌన్ పొడిగింపు విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 25, 2021, 12:46 PM IST
Delhi Lockdown: ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు, ఇవాళ కేజ్రీవాల్ తుది నిర్ణయం

Delhi Lockdown: మొత్తం దేశాన్ని విలవిలలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయినా సరే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్రమణ ఆగకపోవడంతో లాక్‌డౌన్ పొడిగింపు విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ (Corona Second Wave) విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలితాల్ని ఇవ్వడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత ( Remdesivir injections Shortage), జటిలమవుతున్న ఆక్సిజన్ కొరత(Oxygen Shortage). పరిస్థితి భయానకంగా మారిపోతోంది. మరోవైపు కరోనా చికిత్స కోసం కొత్త వ్యాక్సిన్లు, మందులకు అత్యవసర అనుమతులు కూడా ఇస్తున్నారు. కరోనా సంక్రమణ నియంత్రణకు ముందు నైట్‌కర్ఫ్యూ(Night Curfew) అమలు చేసిన ఢిల్లీ ప్రభుత్వం(Delhi government)..తరువాత వారం రోజుల పాటు లాక్‌డౌన్(Lockdown) విధించింది. అయినా సరే కేసులు అదుపులో రాలేదు. ఇప్పటికీ ఢిల్లీలో రోజుకు 24-25 వేల కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఢిల్లీలో 357 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ప్రస్తుతం ఢిల్లీలో విధించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 5 గంటల వరకూ ఉంటుంది. ఇప్పుడు లాక్‌డౌన్ పొడిగించే ( Lockdown Extension) దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi cm Arvind kejriwal) ఈ విషయంపై ఇవాళ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలో కేసుల సంఖ్య పెరగడంతో ఆక్సిజన్‌కు తీవ్రమైన కొరత ఏర్పడింది. గంగారామ్ ఆసుపత్రి, జైపూర్ గోల్డెన్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు లేక..సమయానికి ఆక్సిజన్ అందక 45 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మొత్తం ఢిల్లీ నగరం ప్రాణవాయువు ఆక్సిజన్ కోసం పడిగాపులు కాస్తుందంటే అతిశయోక్తి కాదని చెప్పవచ్చు.

Also read: India Coronavirus Update: వరుసగా రెండవ రోజు 3.5 లక్షలకు చేరుకున్న కరోనా కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News