Rafela deal: రాఫెల్ ఒప్పందంపై  రక్షణ మంత్రి సుదీర్ఘ వివరణ: చైనా,పాక్ లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకే..

భవిష్యత్తులో చైనా,పాక్ లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకే రఫెల్ డీల్ చేసుకున్నామని సభలో రక్షణ మంత్రి వివరణ ఇచ్చారు

Last Updated : Jan 4, 2019, 04:45 PM IST
Rafela deal: రాఫెల్ ఒప్పందంపై  రక్షణ మంత్రి సుదీర్ఘ వివరణ: చైనా,పాక్ లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకే..

రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరుగుతోంది.ఈ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన అనేక అంశాలపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరణ ఇచ్చారు. మన పొరుగుదేశాలైన చైనా, పాకిస్థాన్‌ దేశాలు రక్షణ సంబంధ విషయాల్లో ఒకవైపు దూకుడుగా ఉంటే.. అప్పట్లో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కేవలం 18 యుద్ధవిమానాలను మాత్రమే కొనుగోలు చేసిందని..ఫలితంగా భారత్‌ను రక్షణ రంగంలో వెనక్కి నెట్టేశారని గత యూపీఏ ప్రభుత్వాన్ని రక్షణ మంత్రి నిర్మాలసీతారామన్ ఎద్దేవ చేశారు.

రఫెల్ డీల్ ఎందుకుంటే...
భారత్ - చైనా సరిహద్దులతో పాటు భారత్ - పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో తగిన సామగ్రిని సమకూర్చుకోవాల్సిన అవసరం రక్షణ మంత్రి వెల్లడించారు. అందుకే రాఫెల్ డీల్ ను అత్యవసరంగా గుర్తించామని వివరణ ఇచ్చారు. యుద్ధ విమానాల కొనుగోలు అన్నది దేశ భద్రతకు సంబంధించిన విషయమని ప్రతిపక్ష పార్టీలు గుర్తుంచుకోవాలని సీతా రామన్ హితవు పలికారు. 

అంబానీ అంశం ప్రస్తావన
అనీల్ అంబానీపై ఆరోపణల అంశాన్ని రక్షణ మంత్రి  ప్రస్తావిస్తూ యుద్ధ విమానాలు ఆయన కోసమే కొనుగోలు చేశామని కాంగ్రెస్‌ భావిస్తే ఆయన వెనుక ఖత్రోకీ , రాబర్ట్‌ వాద్రాను ఉన్నారంటూ నిర్మలా సీతారామన్‌ ఎదురుదాడి చేశారు. డిఫెన్స్‌ డీలింగ్స్‌కు..డీలింగ్‌ ఇన్‌ డిఫెన్స్‌కు తేడా ఉందని వ్యాఖ్యానిస్తూ... తాము డిఫెన్స్‌ డీలింగ్స్‌ చేయమని అన్నారు. దేశ భద్రతను, ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకునే ఒప్పందాలు చేసుకుంటామని ఈ సందర్భంగా నిర్మాల సీతారామన్ వివరణ ఇచ్చారు

రాహుల్ విమర్శలకు మంత్రి బదులు
యుద్ధవిమానాల కొనుగోలు డీల్ హెచ్‌ఏఎల్‌ కు ఎందుకు ఇవ్వలేదని రాహుల్ ప్రశ్నకు బదులిస్తూ హెచ్‌ఏఎల్‌ గొప్పలే కాదు.. లోపాలనూ గుర్తించాలన్నారు. తేజస్‌ విషయంలో హెచ్‌ఏఎల్‌ వేగంగా పనిచేయలేదన్న విషయం రాహుల్ గుర్తించాలని ఈ సందర్భంగా తెలిపారు. అయితే హెచ్‌ఏఎల్‌కు తాము తక్కువ చేసి మాట్లాడటం లేదని.. తాము హెచ్‌ఏఎల్‌కు రూ.లక్ష కోట్ల ఒప్పందాలు అప్పగించడమే అందుకు నిదర్శన్నమన్నారు. హెచ్‌ఏఎల్‌ విషయంలో కాంగ్రెస్‌ మొసలికన్నీరు కారుస్తోందని ..అంతగా ప్రేమ ఉన్నట్లయితే  యూపీఏ హయాంలో హెచ్‌ఏఎల్‌ను పక్కన పెట్టి అగస్టాతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు ఈ సందర్భంగా నిర్మాల సీతారామన్ ప్రశ్నించారు. 

రఫేల్‌ యుద్ధ విమాన ముహుర్తం
భారత్‌ కొనుగోలు చేసిన తొలి రఫేల్‌ యుద్ధ విమానం 2019 సెప్టెంబరు నెలలో దేశానికి వస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. 2022 నాటి కల్లా అందుబాటులో రఫేల్‌ యుద్ధ విమానాలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. భారీ మొత్తంలో కూడుకున్న ఈ ఒప్పందం ద్వారా యుద్ధవిమానాలు దిగుమతి చేసుకోవడానికి ఈ మాత్రం సమయం పడుతుందని సభలో రక్షణ మంత్రి నిర్మాల సీతారామన్ వివరణ ఇచ్చారు. 

Trending News