పాక్ భూభాగంలోకి ఇండియన్ మిస్సైల్.. విచారం వ్యక్తం చేసిన భారత రక్షణ శాఖ..

Indian Missile in Pakistan Territory: భారత్‌కి చెందిన ఓ క్షిపణి పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లిన ఘటనపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 09:11 PM IST
  • పాక్ భూభాగంలోకి భారత క్షిపణి
  • విచారం వ్యక్తం చేసిన భారత రక్షణ మంత్రిత్వ శాఖ
  • విచారణకు ఆదేశించినట్లు వెల్లడి
పాక్ భూభాగంలోకి ఇండియన్ మిస్సైల్.. విచారం వ్యక్తం చేసిన భారత రక్షణ శాఖ..

Indian Missile in Pakistan Territory: భారత్‌కి చెందిన ఓ క్షిపణి పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లిన ఘటనపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది పొరపాటున జరిగిన ఘటనగా పేర్కొంది. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని.. దీని పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ విచారణకు ఆదేశిస్తున్నట్లు పేర్కొంది.

'ఎప్పటిలాగే రొటీన్ ప్రాక్టీస్‌లో భాగంగా మార్చి 9, 2022న  చేపట్టిన క్షిపణి ప్రయోగం గురి తప్పింది. సాంకేతిక లోపం కారణంగానే క్షిపణి గురి తప్పినట్లు గుర్తించాం. కేంద్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించి అత్యున్నత స్థాయి కోర్టు విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం కాస్త రిలీఫ్ అనే చెప్పాలి.' అ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అంతకుముందు, భారత్‌కు చెందిన సూపర్ సోనిక్ మిస్సైల్ తమ భూభాగంలో పడిందని పాక్ ఆరోపించిన సంగతి తెలిసిందే. గగనతల సరిహద్దును ఉల్లంఘించి 100కి.మీ లోపలికి క్షిపణి దూసుకొచ్చిందని ఆరోపించింది. దీనిపై పాక్‌లోని భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. ప్యాసింజర్ విమానాలు ఎగిరే ఎత్తులోనే క్షిపణి దూసుకురావడం వల్ల విమాన ప్రయాణాలకు ఆటంకం కలిగిందని ఆరోపించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారత్‌ను హెచ్చరించింది.

Also Read: Radhe Shyam Collections: కలెక్షన్లలో రాధేశ్యామ్​ రికార్డు- మొదటి రోజు ఎంతంటే?

Also read: Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News