గుజరాత్‌లో దారుణం: దొంగతనం ఆరోపణలతో దళితుడిని కట్టేసి కొట్టి చంపారు

దళితుడిని తాడుతో కట్టేసి విచక్షణారహితంగా కొట్టి చంపిన దారుణమైన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకుంది.

Last Updated : May 21, 2018, 03:22 PM IST
గుజరాత్‌లో దారుణం: దొంగతనం ఆరోపణలతో దళితుడిని కట్టేసి కొట్టి చంపారు

దళితుడిని తాడుతో కట్టేసి విచక్షణారహితంగా కొట్టి చంపిన దారుణమైన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముఖేష్‌ వనియా అనే వ్యక్తి తన భార్యతో కలిసి రాజ్‌కోట్‌లో చెత్త ఏరుకుని జీవనం సాగించేవాడు. ఆదివారం ఉదయం ఓ ఫ్యాక్టరీ వైపుకు వెళ్లగా.. అతడిని అడ్డుకున్న కొందరు ఉద్యోగులు దొంగ అని ఆరోపిస్తూ చావబాదారు. అక్కడితో ఆగారా.. వెంట తోడుగా వచ్చిన ఆ దళితుడి భార్యపై కూడా కర్రలతో దాడి చేశారు. ముఖేష్‌ భార్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. దళితులకు గుజరాత్‌ క్షేమదాయకం కాదని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఉనా దాడికంటే ఇది అత్యంత దారుణ ఘటన అని, కుల ఘర్షణలతో అమాయకులు మృతి చెందుతున్నా గుజరాత్ రాష్ట్ర సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ పోస్ట్ చేశారు.

 

 

Trending News