Heavy rains are expected in AP, Odisha, West Bengal Due to Jawad Cyclone Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. బలపడింది. నేడు మధ్యాహ్నం ఇది తుఫానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఇప్పటికే ఈ తుఫానుకు 'జవాద్'గా నామకరణం (Jawad Cyclone) చేసిన విషయం తెలిసిందే.
తుఫాను ప్రభావంతో ప్రస్తుతం గంటకు 60-70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 420 కిలో మీటర్లు, ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 650 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.
తుఫాను ప్రభావం (Jawad Cyclone impact on AP) ఆంధ్రప్రదేశ్, ఒడిశాలపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వివరించింది. ఈ రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో డిసెంబర్ 4 సాయంత్రం నాటికి గంటకు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని చెప్పింది.
తుఫాను కారణంగా.. డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు ఏపీ, బెంగాల్, ఒడిశా, అసోం, మేఘాలయాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ (IMD on Jawad Cyclone) అంచనా వేసింది.
ఈ నెల 5న తుఫాను పూరీ తీరాన్ని తాకి.. బెంగాల్ వైపు కదులుతుందని భావిస్తోంది ఐఎండీ. ఈ సమయంలో తీర ప్రాంతాల్లోని జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఎన్డీఆర్ఎఫ్ అప్రమత్తం..
తుఫాను తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో.. ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ (Jawad Cyclone rains effect) రాష్ట్రాలకు 46 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్‌ను పంపినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ వెల్లడించారు. మరో 18 టీమ్స్ అవసరమైన ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. తుఫాను ప్రభావంతో ఏ ప్రాంతాలోనైనా ఎయిర్‌లిఫ్ట్ (హెలికాప్టర్ల ద్వారా తరలింపు)కు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నట్లు (NDRF alert over Jawad Cyclone) చెప్పారు. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లో 30 మంది చొప్పున సిబ్బంది ఉంటారని తెలిపారు.
A total of 46 NDRF teams have been sent to Odisha, West Bengal and Andhra Pradesh and are prepositioned there. IDS is on alert if the situation arises to airlift any of the teams. 18 more teams are on standby: Atul Karwal DG NDRF #Jawad pic.twitter.com/MkqZTpryX5
— ANI (@ANI) December 3, 2021
Also read: Omicron scare: నిన్న బెంగళూరు.. నేడు ముంబయి, ఢిల్లీలో ఒమిక్రాన్ భయాలు!
Also read: Travel History లేని బెంగళూరు వైద్యుడికి ఒమిక్రాన్.. భయాందోళనలో భారత్! ఇంతకీ ఎలా సోకింది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook