Covid Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్ ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం ప్రారంభం కానుంది. అటు కోవిన్ యాప్ లేటెస్ట్ వెర్షన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా, ప్రైవేటులో కనీస ధర చెల్లించి వ్యాక్సిన్ పొందవచ్చు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ( Covid vaccination )రెండవ దశ మార్చ్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రెండవ దశలో 60 ఏళ్లకు పైగా వయసున్నవారికి, 45 ఏళ్లకు పైగా వయసుండి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రుసుము చెల్లించి టీకా పొందవచ్చు ఇక. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. రెండవ దశ వ్యాక్సినేషన్, ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధరపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో మాట్లాడి వివరాలు అందించారు.
కోవిడ్ వ్యాక్సిన్ ప్రైవేటు ఆసుపత్రు( Covid vaccine in private hospitals) ల్లో ఒక్కొక్క డోసు 250 రూపాయలుగా నిర్ణయించారు. వ్యాక్సిన్ ధర 150 రూపాయలు కాగా, సర్వీసు ఛార్జ్ 100 రూపాయలుంటుంది. ప్రభుత్వ తదుపరి ఉత్తర్వుల వరకూ ఇదే ధర అందుబాటులో ఉంటుంది. 250 రూపాయలకు మించి వసూలు చేయకూడదు. రెండు డోసులకైతే 5 వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్–19 వ్యాక్సినేషన్ సెంటర్లుగా పనిచేస్తూ కరోనా వ్యాక్సిన్ అందజేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలను కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్‌లో పొందుపర్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆయా కేంద్రాల్లో లబ్ధిదారులకు ఏ రోజు, ఏ సమయంలో వ్యాక్సిన్ ఇస్తారన్న సమాచారం ఇందులో ఉంటుందని పేర్కొంది. వ్యాక్సిన్ పొందాలనుకునేవారు ముందుగా కోవిన్ 2.0 యాప్ ( Covin 2.0 )లో వివరాలు నమోదు చేసుకోవల్సి ఉంటుంది.
కోవిన్ యాప్ 2.0ను గూగుల్ ప్లేస్టోర్ ( Playstore) లేదా యాప్‌స్టోర్( Appstore)నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సోమవారం నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. ఇందులో యూజర్ అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్, బెనిఫిషియరీ మాడ్యూల్, బెనిఫిషియరీ ఎక్నాలెడ్జ్‌మెంట్, స్టేటస్ అప్‌డేట్ అనే మాడ్యూల్స్ ఉన్నాయి. ఫ్రంట్‌లైన్ వర్కర్ల జాబితాలో లేని వారు పేరు నమోదుకు రిజిస్ట్రేషన్ మాడ్యూల్‌లోని సెల్ఫ్ రిజిస్ట్రేషన్‌లో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పది ధ్రువీకరణల్లో ఏదో ఒకటి అప్‌లోడ్ చేయాలి. మొబైల్ ఫోన్ నంబర్ రిజిస్టర్ చేశాక లబ్ధిదారులకు ఓటీపీ అందుతుంది. దీనిద్వారా అకౌంట్ క్రియేట్ అవుతుంది. టీకా తీసుకున్న తర్వాత ఎక్నాలెడ్జ్‌మెంట్ అందుతుంది.
Also read: Kamal haasan party: ఎన్నికల నగారా మోగడంతో తమిళనాట కీలక పరిణామాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook