Vaccine Delicensing: దేశంలో వ్యాక్సిన్ కొరత తీర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో నాలుగైదు సంస్థల ద్వారా వ్యాక్సిన్ ఉత్పత్తికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
దేశంలో వ్యాక్సినేషన్ (Vaccination) మూడవ దశ కార్యక్రమం ప్రారంభమైనా అనుకున్నంతగా ముందుకు సాగడం లేదు. కారణం తీవ్రమైన వ్యాక్సిన్ కొరత. ఈ నేపధ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి, పేటెంట్ డీ లైసెన్సింగ్, వ్యాక్సిన్ లభ్యత అంశాలపై బీజేపీ అధికార ప్రతినిధి స్పందించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఇతర దేశాలకు ఇండియా వ్యాక్సిన్ పంపిందని బీజేపీ అధికార ప్రతినిధి సంభీత్ పాత్ర చెప్పారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్(Covishield) ఫార్ములా విదేశాల చేతిలో ఉన్నందున లైసెన్స్ ఫ్రీ చేసేందుకు ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఇక కోవ్యాగ్జిన్ ఫార్ములా (Covaxin Formula) దేశానిదేనన్నారు. ఈ వ్యాక్సిన్‌లో సజీవ వైరస్ ఉన్నందున కట్టుదిట్టమైన వ్యవస్థ అవసరమని తెలిపారు. అటువంటి వ్యవస్థ ఓ కంపెనీ వద్దనే ఉందన్నారు. ఆ కంపెనీతో పాటు మరో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వ్యాక్సిన్ ఉత్పత్తికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఇండియా వ్యాక్సిన్ విదేశాలకు పంపిందని..బదులుగా వ్యాక్సిన్ ముడి సరుకులు వచ్చాయన్నారు. కరోనా సంక్షోభ సమయంలో రాజకీయాలు మాని..ఏకతాటిపై నడవాలని ప్రతిపక్షాలకు సూచించారు.
Also read: Karnataka: కరోనా తగ్గినా డిశ్చార్జ్ కామంటున్న రోగులు, ముఖ్యమంత్రి ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook