Madhya Pradesh Covid Cases: మధ్యప్రదేశ్‌లోని ఓ స్కూల్లో ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి బాధ్యులైనవారిపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే సిరంజీతో 30 మందికి వ్యాక్సినేషన్ జరిపితే ఒకరికి ఉన్న వ్యాధులు మరొకరికి అంటే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ వైద్యాధికారులు, వ్యాక్సినేషన్ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా కేంద్రంలో ఉన్న జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఇటీవల కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా 12-14 ఏళ్ల విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. దాదాపు 30 మంది విద్యార్థులకు వ్యాక్సిన్లు వేయగా.. అందరికీ ఒకే సిరంజీ ఉపయోగించారు. విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ విషయమై ఆ స్కూల్లో వ్యాక్సిన్లు వేసిన ఏఎన్ఎం జితేందర్ రాయ్‌ని ప్రశ్నించారు.
పై అధికారులు కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్‌కు ఒకే సిరంజీ పంపించారని... అదే సిరంజీతో అందరికీ వ్యాక్సిన్లు వేయమని చెప్పారని జితేందర్ రాయ్ పేర్కొనడం గమనార్హం. వాళ్లు చెప్పిందే చేశానని.. ఇందులో తన తప్పేమీ లేదని పేర్కొన్నాడు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపగా.. సాగర్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డీకే గోస్వామి దీనిపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read: Murder for Chapati: ఢిల్లీలో దారుణ ఘటన... ఒక్క చపాతీ కోసం ప్రాణాలే తీశాడు..
Also Read: Komatireddy: అనర్హత వేటు కోసమే సస్పెన్షన్ లేటు? కోమటిరెడ్డి విషయంలో కాంగ్రెస్ పక్కా స్కెచ్?
Sagar, MP | Thirty children at a school in Sagar were allegedly vaccinated by a single injection-syringe
We have got the complaint, and the probe is underway. Stringent action will be taken against those found guilty: DK Goswami, CMHO pic.twitter.com/kzPvyK7Y4t
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 27, 2022
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook