Covid 19 Fourth wave in india: దేశంలో కొవిడ్ ఫోర్త్ వేవ్ మొదలైనట్టేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది కేంద్ర వైద్యశాఖ అధికారుల నుంచి. దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోయాయి. రోజువారీ కేసుల సంఖ్య ఏడు వేలు దాటింది. గత 24 గంటల్లో ఏకంగా 7 వేల 240 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి పోల్చితే ఏకంగా 2 వేల కొత్త కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. బుధవారం 5 వేల 2 వందలకు పైగా కేసులు నమోదు కాగా.. ఒక్క రోజులోనే అ సంఖ్య 7 వేల 2 వందలకు చేరడం వైద్య వర్గాలను కలవరపరుస్తోంది.
గత 24 గంటల్లో వైరస్ నుంచి 3 వేల 591మంది కోలుకున్నారు. దేశంలో రికవరీల సంఖ్య 98.71 శాతంగా ఉంది. మహమ్మారి సోకి మరో 8 మంది చనిపోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32 వేల 498కి పెరిగింది.దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4,31,97,522కు పెరిగింది.
India records 7,240 new COVID19 cases in the last 24 hours; Active cases rise to 32,498 pic.twitter.com/mnXkuoRsCY
— ANI (@ANI) June 9, 2022
READ ALSO: Gang Rape Case Update: పోలీస్ కస్టడీకి గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు.. బడాబాబుల లింకులు బయటపడేనా?
READ ALSO: Shamshabad Rape: అడ్డా కూలీపై అత్యాచారం, దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Covid 19 Fourth wave: భారత్ లో కొవిడ్ ఫోర్త్ వేవ్ మొదలైందా? 7 వేలు దాటిన రోజువారీ కేసులు కేసులు..కేంద్ర సర్కార్ హై అలర్ట్
దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు
గత 24 గంటల్లో 7,240 కేసులు
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు