Covaxin 3rd phase trials: కరోనా మహమ్మారి కట్టడికై తొలి మేకిన్ ఇండియా వ్యాక్సిన్ విషయంలో ఊరట కల్గించే విషయం తెలుస్తోంది. మూడవ దశ ప్రయోగాల ఫలితాలకు నిపుణుల కమిటీ అనుమతి లభించింది.
దేశంలో ప్రస్తుతం మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ (Serum Institute)ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, రష్యన్ కంపెనీ తయారు చేసిన స్పుట్నిక్ వి వ్యాక్సిన్, మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్. కోవాగ్జిన్ విషయంలో అంతర్జాతీయంగా కాస్త ఇబ్బంది ఎదురవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతి ఈ వ్యాక్సిన్‌కు లేదు. ఆ జాబితాలో కోవాగ్జిన్ లేకపోవడంతో..ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారు విదేశాలకు వెళ్లేందుకు ఆటంకం కలుగుతోంది. అత్యవసర వినియోగ జాబితాలో చేర్చమని భారత్ బయోటెక్ కంపెనీ గత కొద్దికాలంగా ప్రయత్నిస్తోంది.
ఈ నేపధ్యంలో భారత్ బయోటెక్ ( Bharat Biotech) కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ సామర్ద్యం 77.8 శాతంగా తేలింది. 25 వేల 8 వందలమందిపై నిర్వహించిన మూడవ దశ ప్రయోగ ఫలితాలను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి (DCGI)కోసం పంపింది. ఈ డేటాను సమీక్షించిన కోవిడ్ 19 సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఆమోదం తెలిపినట్టు డీసీజీఐ వర్గాలు తెలిపాయి. కోవాగ్జిన్ సామర్ధ్యాన్ని ఆమోదించిన నిపుణుల కమిటీ డీసీజీఐకు పంపింది. ఈ వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని పరిశీలించి అనుమతులిచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. భారత్ బయోటెక్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. అన్నీ సజావుగా జరిగితే కోవాగ్జిన్‌కు (Covaxin) అంతర్జాతీయ అనుమతి లభించే అవకాశాలున్నాయి.
Also read: India Covid-19 Cases: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, 3 కోట్లకు చేరిన కరోనా బాధితులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook