Covid-19 Updates : కోవిడ్, ఒమిక్రాన్ కేసుల విజృంభన, బూస్టర్ డోసుల పంపిణీ ప్రారంభం

Coronavirus Omicron Covid Booster doses Updates : దేశంలో రోజురోజుకు కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా, ఒమిక్రాన్ కేసుల వివరాలతో పాటు కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ ప్రారంభం తదితర వివరాలు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 07:07 PM IST
  • దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న కోవిడ్ కేసులు
  • కరోనా, ఒమిక్రాన్ కేసుల వివరాలు
  • కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ ప్రారంభం
Covid-19 Updates : కోవిడ్, ఒమిక్రాన్ కేసుల విజృంభన, బూస్టర్ డోసుల పంపిణీ ప్రారంభం

Coronavirus Omicron Updates Omicron cases to Covid Booster doses distribution details : కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు అవుతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతోన్న కోవిడ్ కేసులతో (Covid cases) దేశంలో థర్డ్‌ వేవ్‌ (Third wave) మొదలైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక దేశంలో తాజాగా నమోదైన కరోనా కేసుల వివరాలు, బూస్టర్ డోసుల పంపిణీ (Booster doses distribution) తదితర వివరాలు ఇలా ఉన్నాయి. 

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) (MoHFW) వెల్లడించిన నివేదిక ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో 1,79,723 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అలాగే గత 24 గంటల్లో 46,569 మంది కోవిడ్‌ (Covid‌) నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 3,45,00,172కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ (Vaccination drive) కింద ఇప్పటి వరకు 151.94 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు (Vaccine doses) అందించారు.

నేటి నుంచి 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి, ఫ్రంట్‌లైన్ కార్మికులకు, (frontline workers) ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ ప్రారంభమైంది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశంలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ ప్రికాషన్‌ డోసు ఇస్తున్నారు.

అయితే ఈ టీకా కోసం కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యాక్సినేషన్‌ (Vaccination‌) కేంద్రానికి డైరెక్ట్‌గా వెళ్లి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం.. 1.05 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్, 2.75 కోట్ల మంది సీనియర్‌ సిటిజన్స్ ఈ బూస్టర్‌‌ డోసు పొందనున్నారు.

Also Read : Telangana Weather Report: తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు- వాతావరణ కేంద్రం హెచ్చరిక

ఇక 15 - 18 సంవత్సరాల మధ్య వయసు వారికి రెండు కోట్ల కంటే ఎక్కువే వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Union Minister Anurag Thakur) తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు (Omicron variant cases) కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 4,033 ఒమిక్రాన్ (Omicron) వేరియెంట్ కేసులు నమోదయ్యాయి.

Also Read : Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​కు కరోనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News