India Covid-19: కొత్తగా 37,975 కరోనా కేసులు 

భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం దేశంలో 44వేల కరోనా కేసులు నమోదు కాగా.. సోమవారం 38వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.

Last Updated : Nov 24, 2020, 10:02 AM IST
  • గత 24 గంటల్లో సోమవారం ( నవంబరు 23న ) దేశ వ్యాప్తంగా కొత్తగా.. 37,975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 480 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,77,841 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,34,218 కి చేరింది.
India Covid-19: కొత్తగా 37,975 కరోనా కేసులు 

Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం దేశంలో 44వేల కరోనా కేసులు నమోదు కాగా.. సోమవారం 38వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో సోమవారం ( నవంబరు 23న ) దేశ వ్యాప్తంగా కొత్తగా.. 37,975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 480 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,77,841 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,34,218 కి చేరింది. Also read: Covid-19 Vaccine: 70శాతం సమర్థవంతంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

అయితే నిన్న ఈ మహమ్మారి నుంచి 42,314 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 86,04,955 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 4,38,667 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.76 శాతం ఉండగా.. మరణాల రేటు 1.46 శాతం ఉంది. Also read: Shanvi Srivastava: బికినీలో రెచ్చిపోయిన ‘లవ్లీ’ బ్యూటీ శాన్వీ

ఇదిలాఉంటే.. సోమవారం దేశవ్యాప్తంగా 10,99,545 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 23వ తేదీ వరకు దేశంలో మొత్తం 13,36,82,275 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఎసీఎంఆర్ వెల్లడించింది. Also read: Tarun Gogoi: అస్సాం మాజీ ముఖ్యమంత్రి గొగోయ్ కన్నుమూత

Trending News