Corona Positive Cases: ఇండియాలో గణనీయంగా తగ్గిన కరోనా మరణాలు, జూన్ నెలలో ఇదే తొలిసారి

India Corona Positive Cases: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇండియా అగ్రగామిగా నిలిచింది. అగ్రరాజ్యం అమెరికాను వెనక్కినెట్టింది. అమెరికాలో 32,36,63,297 (32 కోట్ల 33 లక్షల 27 వేల 328 డోసుల కరోనా టీకాలు ఇచ్చారు. తద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్19 టీకాలు ఇచ్చిన దేశంగా భారత్ నిలిచింది. 

Written by - Shankar Dukanam | Last Updated : Jun 28, 2021, 09:52 AM IST
Corona Positive Cases: ఇండియాలో గణనీయంగా తగ్గిన కరోనా మరణాలు, జూన్ నెలలో ఇదే తొలిసారి

India Corona Positive Cases: ఇండియాలో డెల్టా, డెల్టా ప్లస్ లాంటి కోవిడ్19 వేరియంట్ కేసులు పుట్టుకొస్తున్నాయి. అయినప్పటికీ భారత్‌లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు తగ్గాయి. దేశ వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 46,148 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపితే ఇండియాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,02,79,331కు (30 కోట్ల 2 లక్షల 79 వేల 331)కు చేరుకుంది. 

దేశంలో దాదాపు రెండున్నర నెలల అనంతరం వెయ్యి దిగువన కరోనా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 979 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ దేశంలో సంభవించిన కోవిడ్19 మరణాల సంఖ్య 3,96,730 (3 లక్షల 96 వేల 730)కి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 5,72,994 యాక్టివ్ కోవిడ్19 కేసులున్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 96.80 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజులో దేశంలో 58,578 మంది కరోనాను జయించగా, ఇప్పటివరకూ 2,93,09,607 మంది కోవిడ్19ను జయించి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుల చేసింది. కరోనా వ్యాక్సిన్ (Corona vaccine) ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.

Also Read: Mann Ki Baat: నేను, నా తల్లి కరోనా టీకాలు తీసుకున్నామంటూ PM Modi పలు కీలక విషయాలు 

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇండియా అగ్రగామిగా నిలిచింది. దేశంలో ఇప్పటివరకూ 32,36,63,297 (32 కోట్ల 36 లక్షల 63 వేల 297) డోసుల కోవిడ్19 (COVID-19) వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇచ్చినట్లు కేంద్ర వైద్యశాఖ తెలిపింది. తద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్19 టీకాలు ఇచ్చిన దేశంగా భారత్ నిలిచింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాను వెనక్కినెట్టింది. అమెరికాలో 32,36,63,297 (32 కోట్ల 33 లక్షల 27 వేల 328 డోసుల కరోనా టీకాలు ఇచ్చారు. అమెరికా గత ఏడాది డిసెంబర్‌లో టీకాల పంపిణీ ప్రారంభించగా, భారత్ ఈ ఏడాది జనవరి 16న వ్యాక్సినేషన్ మొదలుపెట్టడం గమనార్హం.

Also Read: Vitamin D Benefits: విటమిన్ డి లోపం ఉన్నవారిలో కోవిడ్19 మరణాలు అధికం, సర్వేలో వెల్లడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News