Corona Active Cases In India: ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. మూడు రోజుల తరువాత దేశంలో కోవిడ్19 కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,29,476 (19 లక్షల 29 వేల 476) శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా 62,480 మందికి పాజిటివ్ అని నిర్ధారించారు.
తాజా కేసులు కలిపితే దేశంలో ఇప్పటివరకూ కరోనా బాధితుల సంఖ్య 2,97,62,793 (2 కోట్ల 97 లక్షల 62 వేల 793)కు చేరుకుంది. బుధవారంతో పోల్చితే దాదాపు 5 వేల కరోనా కేసులు గురువారం తక్కువగా నమోదయ్యాయి. దాదాపు రెండు నెలల తరువాత కోవిడ్19 మరణాలు 2 వేల దిగువకు వచ్చాయి. నిన్న ఒక్కరోజు 1,587 మందిని కరోనా బలితీసుకుంది. ఇండియాలో మొత్తం కరోనా వైరస్ (CoronaVirus Latest Updates) మరణాల సంఖ్య 3,83,490 (3 లక్షల 83 వేల 490)కు చేరింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 88,977 (88 వేల 9 వందల 77) మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకూ 2 కోట్ల 85 లక్షల 80వేల 647 మంది కోవిడ్19 మహమ్మారిని జయించారు.
Also Read: Global COVID-19 Death Toll: ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షలు దాటిన కరోనా మరణాలు
India reports 62,480 new #COVID19 cases, 88,977 discharges & 1,587 deaths in last 24 hrs, as per Health Ministry
Total cases: 2,97,62,793
Total discharges: 2,85,80,647
Death toll: 3,83,490
Active cases: 7,98,656 (below 8 lakh after 73 days)Vaccination: 26,89,60,399 pic.twitter.com/hhd9c2krzs
— ANI (@ANI) June 18, 2021
ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షల దిగువకు చేరుకున్నాయి. ప్రస్తుతం 7,98,656 యాక్టివ్ కేసులున్నాయి. 73 రోజుల తరువాత కరోనా యాక్టివ్ కేసులు కనిష్టానికి చేరుకున్నాయి. గత ఏడాది నుంచి భారత్‌లో ఇప్పటివరకూ 26,89,60,399 (26 కోట్ల 89 లక్షల 60 వేల 399) కోవిడ్19 వ్యాక్సిన్ డోసులు (Steroids for Covid-19 Treatment) ఇచ్చారు. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: Telangana: తెలంగాణ లేటెస్ట్ హెల్త్ బులెటిన్.. తగ్గుతున్న Corona కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook