80 వేలకు చేరువలో కేసులు..!!

'కరోనా వైరస్' పాజిటివ్ కేసుల గ్రాఫ్ అంతకంతకు పెరిగిపోతోంది. రోజు రోజుకు నంబర్ల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగానే కాదు.. భారత దేశంలోనూ కేసుల సంఖ్య రికార్డు దిశగా పరుగులు పెడుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

Last Updated : May 12, 2020, 09:57 AM IST
80 వేలకు చేరువలో కేసులు..!!

'కరోనా వైరస్' పాజిటివ్ కేసుల గ్రాఫ్ అంతకంతకు పెరిగిపోతోంది. రోజు రోజుకు నంబర్ల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగానే కాదు.. భారత దేశంలోనూ కేసుల సంఖ్య రికార్డు దిశగా పరుగులు పెడుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

భారత దేశంలో ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా మహమ్మారి వ్యాప్తి ఆగడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 80 వేల చేరువకు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేల 756గా ఉంది. అందులో 46 వేల 8 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 22 వేల 454 మంది కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని సురక్షితంగా ఇంటికి వెళ్లారు. అందులో ఒక వలస కూలీ కూడా ఉండడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి 2 వేల 293 మంది బలయ్యారు. 

అలాగే గత 24 గంటల్లో 3 వేల 604 కొత్త కేసులు నమోదు కావడం విశేషం. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. మరోవైపు నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి దెబ్బకు 87 మంది ప్రాణాలు విడిచారు. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికవరీ రేటు 31.73  శాతం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజు రోజుకు రికవరీ రేటు పెరుగుతోందని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో నెల రోజుల్లో కనీసం 800 కేసులు నమోదవుతున్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News