AICC NEW PRESIDENT: 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తి పగ్గాలు.. కాంగ్రెస్ చీఫ్ గా ఖర్గే ఘన విజయం

AICC NEW PRESIDENT: 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడయ్యారు. అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కర్ణాటకకు చెందిన పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే విజయం సాధించారు.

Written by - Srisailam | Last Updated : Oct 19, 2022, 03:11 PM IST
 AICC NEW PRESIDENT: 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తి పగ్గాలు.. కాంగ్రెస్ చీఫ్ గా ఖర్గే ఘన విజయం

AICC NEW PRESIDENT: 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడయ్యారు. అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కర్ణాటకకు చెందిన పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే విజయం సాధించారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన శశి థరూర్ పై విజయం సాధించారు. ఏఐసీసీ ప్రెడిసెంట్ ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గేకు 7 వేల 897 ఓట్లు రాగా... శశి థరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన మల్లికార్జున ఖర్గేకు ట్విట్టర్ ద్వారా శశి థరూర్ శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఖర్గేతో పాటు శశి థరూర్ నిలిచారు. ఈనెల 15వ తేదిన పోలింగ్ జరిగింది. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ డెలిగేట్లు ఓటటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 96 శాతం పోలింగ్ నమోదైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News