Congress: కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలకు పరిష్కారం లభిస్తుందా..పార్టీ మరమ్మత్తు పనులకు దిగిందా ? అసంతృప్త నేతల వాదనతో ఎట్టకేలకు అధిష్టానం అంగీకరించిందా ? ఇవాళ జరగనున్న సమావేశంలో ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది..అసలేం జరిగింది ?
మహా సముద్రం లాంటి పార్టీలో అసమ్మతి సాధారణమే అంటు ఎప్పుడు కొట్టిపారేసే ధోరణి నుంచి కాంగ్రెస్ పార్టీ ( Congress party ) బయటకు వస్తున్నట్టే కన్పిస్తోంది. గత కొద్దిరోజులుగా పార్టీ అధిష్టానంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ లీడర్ల వ్యవహారమై..కాంగ్రెస్ పార్టీ రంగంలో దిగింది. సమస్య పరిష్కారం కోసం మరమ్మత్తు పనులు ప్రారంభించింది. అసంతృప్త నేతలతో స్వయంగా సోనియా గాంధీ ( Sonia gandhi ) సమావేశం కానున్నారు. రెండ్రోజులపాటు జరగనున్న ఈ సమావేశంలో పార్టీలో అసంతృప్తి, ప్రక్షాళన తదితర అంశాలంపై చర్చించనున్నారు.
పార్టీలో ప్రక్షాళన అవసరమంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు ( Congress senior leaders ) 23 మంది సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం సంచలనమైంది. అప్పటి నుంచి సీనియర్లు బహిరంగంగానే కాంగ్రెస్ అధిష్టానానికి, పార్టీకు వ్యతిరేకంగా నిరసన విన్పిస్తూనే ఉన్నారు. పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్టీకు ఎదురవుతున్న వరుస ఓటములు. అన్నీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రెబెల్ నేతలతో సమావేశమవుతున్నారు. Also read: Marriage Promise: ఆ శారీరక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేం: సంచలన తీర్పు
రెండ్రోజుల పాటు జరిగే సమావేశంలో కీలకాంశాలపై చర్చ జరగనుంది. ఏఐసీసీ ఎన్నిక ( AICC Election ) పై నిర్ణయముంటుందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ( Kamalnath ) ప్రధాన సంధానకర్తగా వ్యవహరించనున్నారు. పార్టీకి పూర్తికాలపు అధ్యక్షుడు ఉండాలని..ఏఐసీసీ, సీడబ్ల్యూసీ సహా అన్ని పార్టీ విభాగాల పదవులకు ప్రజాాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలనేది సీనియర్ల వాదన. ఈ సమావేశానికి పార్టీ కీలక నేతలు గులాం నబీ ఆజాద్ ( Gulam nabi Azad ), కపిల్ సిబల్ ( Kapil sibal ), మనీష్ తివారి, శశి థరూర్, ఆనంద్ శర్మ, వీరప్ప మొయిలీ, పృధ్వీరాజ్ చవాన్ తదితరులు హాజరు కానున్నారు.
రెండ్రోజులపాటు జరగనున్న సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశ కేడర్ లో ఉందని నేతలు చెబుతున్నారు. అసమ్మతి నేతలతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ( Manmohan singh ), పి చిదంబరం ( P Chidambaram ) , అశోక్ గెహ్లాట్ తదితరులతోనూ సోనియా గాంధీ మంతనాలు జరపనున్నారు. Also read: Hathras Case: గ్యాంగ్ రేప్ నిజమే.. సీబీఐ