Kerala: బ్రేకప్ కు ఒప్పుకోలేదని.. ప్రియుడికి విషమిచ్చి చంపిన గర్ల్‌ఫ్రెండ్..

Thiruvananthapuram: తన పెళ్లికి అడ్డువస్తున్నాడని ప్రియుడికి విషమిచ్చి చంపింది ఓ ప్రియురాలు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2022, 10:18 AM IST
Kerala: బ్రేకప్ కు ఒప్పుకోలేదని.. ప్రియుడికి విషమిచ్చి చంపిన గర్ల్‌ఫ్రెండ్..

Thiruvananthapuram Crime: కేరళలోని తిరువనంతరపురానికి చెందిన గ్రీష్మ, షరోన్ ప్రేమించుకుంటున్నారు. అయితే గ్రీష్మకు మరోక యువకుడితో పెళ్లి నిశ్చయించారు పెద్దలు. దీంతో అతడిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది గ్రీష్మ. అయితే తన వివాహం కోసం ప్రియుడికి బ్రేకప్ చెప్పాలనుకుంది. దానికి షరోన్ ఒప్పుకోకపోవడంతో అతడిని ఎలాగైనా వదిలించుకోవాలని  ఆమె అనుకుంది. ఎంత ప్రయత్నించిన వీలుకాకపోవడంతో షరోన్ ను చంపాలనే నిర్ణయానికి వచ్చింది. 

దీంతో అతడిని ఈనెల 14న ఇంటికి పిలిచింది. తర్వాత కపిక్ అనే పెస్టిసైడ్ కలిపిన కషాయం అతడి చేత తాగించింది. వెంటనే వాంతులు చేసుకున్న అతడు స్నేహితుడితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆస్పత్రిలో చేరిన షరోన్ పదకొండు రోజులపాటు మృత్యువుతో పోరాడి.. ఈ నెల25న ప్రాణాలు విడిచాడు. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

ఈ కేసులో భాగంగా... పోలీసులు గ్రీష్మాను దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించారు. చివరకు గ్రీష్మా నేరాన్ని ఒప్పుకుంది. దీంతో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరువనంతపురంకు చెందిన 23 ఏళ్ల రేడియాలజీ విద్యార్థి షరోన్ రాజ్ ను  గ్రీష్మా హత్య చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) అజిత్ కుమార్ తెలిపారు. గ్రీష్మా మరియు షారోన్ ఒక సంవత్సరం నుంచి రిలేషన్ షిప్ లో ఉంటున్నారని పోలీసులు వెల్లడించారు. 

Also Read: Maharashtra: పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృత్యువాత.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

.

Trending News