Tamil Nadu: దేశంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కామాంధుల కోరల్లో చిక్కి...అడపిల్లలు బలైపోతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటన తమిళనాడు(Tamil Nadu)లో చోటుచేసుకుంది. లైంగిక వేధింపులు(sexual harassment) తాళలేక ఓ బాలిక బలవన్మరణానికి(Girl Suicide) పాల్పడింది. లేఖ రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకుంది.
కరూర్ జిల్లాలో 12వ తరగతి చదివే ఓ బాలిక శుక్రవారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకుంది. బాలిక చనిపోయే ముందు తన వ్యక్తిగత డైరీలో ఓ లేఖ(Letter) రాసిపెట్టింది. దాంట్లో తాను లైంగిక వేధింపులు గురయ్యానని పేర్కొంది. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు బాలికపై లైంగిక వేధింపుల(sexual harassment)కు సంబంధించి.. ఆమె చదివే పాఠశాలలో జిల్లా విద్యా శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక వాట్సాప్ చాట్‌ను సైబర్ పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
Also Read: మైనర్ బాలికపై నలుగురి గ్యాంగ్ రేప్... ప్రియుడి కళ్ల ముందే అఘాయిత్యం...
తమిళనాడులో రెండు వారాలలోపు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మైనర్ ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండో కేసు. గతవారం కోయంబత్తూర్( Coimbatore)లో ఇదే తరహా ఘటన జరిగింది. ఓ ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో నిందితుడిని, స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook