Rape: పదో తరగతి బాలికపై క్లాస్‌మేట్ అత్యాచారం... గర్భం దాల్చిన బాలిక...

Girl raped by classmate: పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై ఆమె క్లాస్‌మేట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కోయంబత్తూరు శివారులోని తుడియలూర్‌లో వెలుగుచూసింది.బాలిక గర్భం దాల్చడంతో అత్యాచార విషయం బయటపడింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 07:56 PM IST
  • పదో తరగతి బాలికపై క్లాస్ మేట్ అత్యాచారం
  • గర్బం దాల్చిన ఆ మైనర్ బాలిక
  • నిందితుడిపై కేసు నమోదు, అరెస్ట్
Rape: పదో తరగతి బాలికపై క్లాస్‌మేట్ అత్యాచారం... గర్భం దాల్చిన బాలిక...

Girl raped by classmate: తమిళనాడులో (Tamilnadu) దారుణం వెలుగుచూసింది. ఓ పదో తరగతి విద్యార్థి తన క్లాస్‌మేట్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో అత్యాచార విషయం బయటపడింది. దీంతో బాధిత బాలిక తల్లి నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే... కోయంబత్తూరు శివారులోని తుడియలూర్‌కి చెందిన ఓ బాలిక స్థానిక ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. తన క్లాస్‌మేట్ అయిన ఓ అబ్బాయితో ఆమెకు చాలాకాలంగా పరిచయం ఉంది. ఇద్దరు ఒకరి ఇంటికి మరొకరు వెళ్తుండేవారు. ఈ ఏడాది జులై 25న నోట్ బుక్ కోసమని ఆ బాలిక అతని ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అతనొక్కడే ఉన్నాడు. బాలికను బలవంతం చేసి ఆమెపై లైంగిక దాడికి (Rape) పాల్పడ్డాడు. ఆపై ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

అప్పటినుంచి పలుమార్లు బాలికపై ఆ బాలుడు అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. ఇటీవల ఓరోజు బాలిక వాంతులు చేసుకోవడంతో ఆమె తల్లి ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలికకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆమె ఐదు నెలల గర్భంతో ఉన్నట్లు చెప్పారు. దీంతో షాక్ తిన్న బాలిక తల్లి... కూతురిని ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టింది. కూతురిని వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

బాలుడిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి:

ఇదే తుడియలూర్‌లో జరిగిన మరో ఘటనలో ఓ ఆటో డ్రైవర్ పదో తరగతి బాలుడిపై లైంగిక దాడికి (Sexual Assault) పాల్పడ్డాడు. బాలుడు నడుచుకుంటూ స్కూల్‌కు వెళ్తున్న సమయంలో... ఆటోలో ఎక్కితే దిగబెడుతానని చెప్పాడు. దీంతో బాలుడు ఆటో ఎక్కగా... అతన్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అతనికి పోర్న్ వీడియోలు చూపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలుడిని స్కూల్ దగ్గర దిగబెట్టి వెళ్లిపోయాడు. జరిగిన ఘటన గురించి బాలుడు స్కూల్ టీచర్‌కు చెప్పడంతో.... వారు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని వెంటపెట్టుకుని స్థానిక విమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: Regina Cassandra: రెజీనాకు బర్త్ డే గిఫ్ట్.. 'శాకిని డాకిని' ఎలా ఉన్నారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News